Nizamabad: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - May 12 , 2024 | 12:46 PM
లోక్ సభ ఎన్నికల నిర్వహణకు నిజామాబాద్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తైంది. ఎన్నికల సిబ్బంది విధులకు బయలుదేరుతోంది. పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో మొత్తం 1808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం 17,04,867 మంది ఓటర్లున్నారు.
నిజామాబాద్: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు నిజామాబాద్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తైంది. ఎన్నికల సిబ్బంది విధులకు బయలుదేరుతోంది. పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో మొత్తం 1808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం 17,04,867 మంది ఓటర్లున్నారు. 3000 పైచిలుకు మందితో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలను మోహరించారు. స్థానిక సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు సైతం ఎన్నికల విధుల్లో పాల్గొననున్నాయి.
Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!
7 కంపెనీల కేంద్ర బలగాలు, ఐదు కంపెనీల టీఎస్ఎస్పీ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. నలుగురు అదనపు డీసీపీలు, 19 మంది ఏసీపీలు, 38 సీ.ఐలు, 64 మంది ఎస్.ఐలు, ఇతర సిబ్బంది ఎన్నికల విధులను నిర్వహించనున్నారు. ఎన్నికల నియమావళి అమలును పక్కాగా పరిశీలించేందుకు 107 మొబైల్ పార్టీ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో రూ. 3.05 కోట్ల నగదు, రూ. 24.64 లక్షల విలువ చేసే మద్యం, రూ. 3.65 లక్షల విలువ చేసే 14 కిలోల గంజాయి, రూ. 29 లక్షల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదికూడా చదవండి: Lok Sabha Elections: ఓటెయ్యండి.. బంపర్ ఆఫర్స్ కొట్టేయండి.. వివరాలివే..
Read Latest Telangana News and National News