Congress: లోక్‌సభ 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాలపైనే కాంగ్రెస్ ఫోకస్!
ABN , Publish Date - Mar 07 , 2024 | 11:03 AM
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections 2024) కాంగ్రెస్(congress) కీలక ప్రాంతాల్లో గెలిచేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటివల కాంగ్రెస్ మ్యానిఫెస్టో(manifesto) కమిటీ ముసాయిదాను రూపొందించి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(mallikarjun kharge)కు సమర్పించారు. అయితే అందులో ఎలాంటి అంశాలను పొందుపర్చారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections 2024) కాంగ్రెస్(congress) కీలక ప్రాంతాల్లో గెలిచేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటివల కాంగ్రెస్ మ్యానిఫెస్టో(manifesto) కమిటీ ముసాయిదాను రూపొందించి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(mallikarjun kharge)కు సమర్పించారు. ఈ క్రమంలో మ్యానిఫెస్టోలో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారనేది ఇప్పుడు చుద్దాం. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను చేర్చారు.
దీంతోపాటు కనీస మద్దతు ధర(MSP), సచార్ కమిటీ సిఫారసుల అమలు, పాన్ ఇండియాలో కుల గణన, ఓబీసీకి రిజర్వేషన్లను పెంచడం వంటి వాటిని ప్రతిపాదించారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని యువతను ఆకర్షిస్తూనే తొలిసారిగా కాంగ్రెస్(Congress) "ఉపాధి హక్కు"ను అందించడంతో పాటు జీవిత బీమా, వైకల్యం వంటి అంశాలను కూడా చేర్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో 'న్యాయానికి ఐదు స్తంభాలు' అనే అంశాలపై దృష్టి సారించారని తెలిసింది. యువతకు(youth) గౌరవ వేతనంతో పాటు శిక్షణ, పేపర్ లీకేజీలపై కఠిన చట్టాలు చేయడం, 'అగ్నీపథ్' పథకాన్ని రద్దు చేయడం వంటి అంశాలపై దృష్టి సారించినట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ మేనిఫెస్టో కమిటీలో ప్రియాంక గాంధీ వాద్రా, శశిథరూర్, జైరాం రమేష్, శశి థరూర్, గుర్దీప్ సప్పల్, కేరాజు, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, ఆనంద్ శర్మ వంటి సీనియర్ నేతలు ఉన్నారు. మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి చిదంబరం(p chidambaram) నేతృత్వంలోని పార్టీ నాయకులు లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేశారు. అయితే తుది మెరుగులు దిద్దిన తర్వాత పార్టీ వర్కింగ్ కమిటీ దీనిని ఆమోదించనుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: University: వైఫై కోసం రూ.67.71 కోట్లు.. ఎక్కడంటే..?