Share News

Postal Ballot: పెందుర్తిలో మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్..

ABN , Publish Date - May 07 , 2024 | 11:46 AM

పెందుర్తిలో ఉద్యోగస్తుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొదలైంది. పెందుర్తి మండల పరిషత్ ఆఫీసులో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉదయం 10:30 గంటలకు మొదలైంది. పెందుర్తి నియోజకవర్గం లో 3,871 మంది తమ ఓటు హక్కును బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఉద్యోగులు వినియోగించుకోనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వేసే ఉద్యోగులందరూ తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని ఆర్ఓ సూర్య కళ తెలియజేశారు.

Postal Ballot: పెందుర్తిలో మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్..

విశాఖ: పెందుర్తిలో ఉద్యోగస్తుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొదలైంది. పెందుర్తి మండల పరిషత్ ఆఫీసులో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉదయం 10:30 గంటలకు మొదలైంది. పెందుర్తి నియోజకవర్గం లో 3,871 మంది తమ ఓటు హక్కును బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఉద్యోగులు వినియోగించుకోనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వేసే ఉద్యోగులందరూ తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని ఆర్ఓ సూర్య కళ తెలియజేశారు. ఓటింగ్ సందర్భంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండడానికి పోలీసులు తగిన భద్రతా చర్యలను ఆమె చేపట్టారు.

BRS: వరంగల్ బీఆర్ఎస్‌లో పార్టీ ఫండ్ రగడ


ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికలు (Elections) కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌ (Polling)కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే అక్రమాలకు అధికార, ప్రతిపక్షాలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ (Postal Ballot Voting) జరుగుతోంది. దీంతో ఉద్యోగులు (Employees) తమ ఓటు (Vote) హక్కును వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఓటర్లు మొబైల్ ఫోన్లతో పోలింగ్ కేంద్రంలోకి వెళుతున్నారు. ఇప్పటికే ఉద్యోగులను అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటు వేసిన అనంతరం ఫోటో తీసి దానిని చూపిస్తే డబ్బు ఇస్తామని చెప్పడంతో ఉద్యోగులు మొబైల్ ఫోన్‌లతో పోలింగ్ కేంద్రంలోకి వెళుతున్నారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఓటర్ల వద్ద మొబైల్ అనుమతి ఉండకూడదన్న నిబంధనను సైతం ఉద్యోగులు కొందరు పక్కనబెట్టేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

PM MODI : మాఫియా రాజ్‌.. కరప్షన్‌ కింగ్‌

దేశంలో అమృత ఘడియలు.. రాష్ట్రంలో విష ఘడియలు

Read Latest AP News and Telugu News

Updated Date - May 07 , 2024 | 11:46 AM