AP Election 2024: మళ్లీ ప్రారంభమైన వైసీపీ ఫేక్ ప్రచారం
ABN , Publish Date - May 07 , 2024 | 09:41 PM
ఏపీ అసెంబ్లీ 2024 (AP Election 2024), లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో జగన్ సారధ్యంలోని వైఎస్సార్సీపీ మరోసారి ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. ఈ సారి పథకాలు రాకపోవడానికి చంద్రబాబే కారణమంటూ వైసీపీ గ్యాంగ్ ఫేక్ విష ప్రచారం షురూ చేసింది. ఆసరా, చేయూత, ఫీజ్ రీయింబర్స్మెంట్లపై ఏపీ వాసులకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తోంది.
అమరావతి: ఏపీ అసెంబ్లీ 2024 (AP Election 2024), లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో జగన్ సారధ్యంలోని వైఎస్సార్సీపీ మరోసారి ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. ఈ సారి పథకాలు రాకపోవడానికి చంద్రబాబే కారణమంటూ వైసీపీ గ్యాంగ్ ఫేక్ విష ప్రచారం షురూ చేసింది. ఆసరా, చేయూత, ఫీజ్ రీయింబర్స్మెంట్లపై ఏపీ వాసులకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తోంది. చంద్రబాబే ఫీజురీయింబర్స్‌మెంట్ రాకుండా అడ్డుపడ్డారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది.
జూన్ 4న వెలువడే ఫలితాల్లో వైసీపీ గెలిచిన వెంటనే సీఎం జగన్ మళ్లీ అన్ని పథకాలను ఇస్తారంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లను నమ్మబలికే ప్రయత్నం చేస్తోంది. కాగా ఐవీఆర్ఎస్ కాల్స్ వెనుక వైసీపీ పేటీఏం బ్యాచ్ ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అన్ని పథకాలు ఆగేందుకు చంద్రబాబే కారణమని, ఆయనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని ప్రచారం చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ వ్యవహారం, ఫేక్ ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది.