Share News

100Years Life: జపాన్ ప్రజల సీక్రెట్ ఇదే.. ఈ 5 ఆహారాలతో ఏకంగా 100ఏళ్ల ఆయుష్షు ఖచ్చితమట..!

ABN , Publish Date - Jan 25 , 2024 | 04:31 PM

ఎన్నో దేశాల ప్రజలకు 60ఏళ్లు బ్రతకడం గగనమవుతుంటే జపాన్ ప్రజలు మాత్రం ఎంచక్కా 100ఏళ్లు ఖాతాలో వేసుకుంటున్నారు. వారి సీక్రెట్ ఇదే..

100Years Life: జపాన్ ప్రజల సీక్రెట్ ఇదే.. ఈ 5 ఆహారాలతో ఏకంగా 100ఏళ్ల ఆయుష్షు ఖచ్చితమట..!

పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే నూరేళ్లు జీవించమని దీవిస్తుంటారు. కానీ కాలం గడిచేకొద్దీ మనిషి ఆయుష్షు తగ్గిపోతోంది. చిన్న వయసులోనే మరణాలు సంభవిస్తున్నాయి. 40, 50 ఏళ్లకే వృద్దులకు రావాల్సిన సమస్యలు వస్తున్నాయి. అయితే జపాన్ ప్రజలు మాత్రం ఎంచక్కా 100ఏళ్లు హాయిగా జీవిస్తున్నారు. జపాన్ తో సహా చాలా ప్రాంతాలను బ్లూ జోన్ గా గుర్తించారు. వారు తీసుకునే ఆహారమే వారి ఆయుష్షు రహస్యమని అడపాదడపా వార్తలు బయటకు వస్తుంటాయి. జపాన్ ప్రజలు 5 ఆహారాలు బాగా తినడం వల్ల వారికి 100ఏళ్ళ ఆయుష్షు సాధ్యమవుతోందని తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే.. వీటిలో చాలా ఆహారాలు భారత్ ప్రజలకు లభించేవే.. ఈ ఆహారాలేంటో తెలుసుకుంటే..

మిషో సూప్..

పులియబెట్టిన సోయా నుండి మిషో సూప్ తయారుచేస్తారు. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇది కూడా చదవండి: అల్పాహారంలో ఇవి తీసుకుంటే చాలు.. రోజంతా రేసుగుర్రం లెక్క చురుగ్గా ఉంటారు!


స్వీట్ పొటాటో..

చిలగడదుంపలను స్వీట్ పోటాటో అని కూడా పిలుస్తారు. భారతదేశంలో చిలగడదుంపలను బాగా పండిస్తారు. చిలగడదుంపలలో ఆంథోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఒబేసిటీ ప్రభావాలు కలిగి ఉంటుంది.

డైకాన్ ముల్లంగి..

డైకాన్ ముల్లంగి సాధారణ ముల్లంగి కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇందులో అధికమొత్తంలో విటమిన్-సి ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఈ కారణంగా శరీరం ఎలాంటి జబ్బులను అయినా ఎదుర్కోగలుగుతుంది.

సీవీడ్..

సముద్రపు పాచిని సీవీడ్ అని అంటారు. ఇది చాలా శక్తివంతమైన ఆహారం. సీవీడ్‌లో విటమిన్ ఎ, సి, ఇ, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని సెల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి. ఇది కాకుండా, శరీరం మెరుగ్గా పనిచేయడానికి అవసరమైన అన్ని రకాల ఖనిజాలు ఇందులో ఉంటాయి.

ఇది కూడా చదవండి: Home Cleaning: వ్యాధులనేవి ఇంటి దరిదాపుల్లో ఉండకూడదంటే.. ఇంటిని ఈ టిప్స్ తో శుభ్రం చెయ్యాల్సిందే..!


చేపలు..

ఎక్కువకాలం బ్రతకాలంటే చేపలు తినడం బెస్ట్ అని ఆహార నిపుణులు అంటున్నారు. జపాన్ ప్రజలు కూడా చేపలను ఎక్కువగా తింటారు. . చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 25 , 2024 | 04:31 PM