Share News

Health: పురుషుల్లో కీలక హార్మోన్ టెస్టెస్టిరాన్ తగ్గడానికి కారణాలు ఇవే!

ABN , Publish Date - Jul 15 , 2024 | 05:06 PM

పురుషుల్లో కీలకమైన టెస్టెస్టిరాన్ హార్మోన్ తగ్గడానికి ప్రాసెస్డ్ ఫుడ్, డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక బరువు, నిద్రలేమి తదితర అంశాలు కారణమని వైద్యులు చెబుతున్నారు.

Health: పురుషుల్లో కీలక హార్మోన్ టెస్టెస్టిరాన్ తగ్గడానికి కారణాలు ఇవే!

ఇంటర్నెట్ డెస్క్: పురుషుల ఆరోగ్యానికి (Health) అత్యంత కీలకమైన హార్మోన్లలో టెస్టెస్టిరాన్ ఒకటి. లైంగికాసక్తిని పెంచడంతో పాటు ఎముకల ద్రుఢత్వం, భావోద్వేగాల నియంత్రణ, కండరాల శక్తి, ఎర్రరక్తకణాల సంఖ్య వంటివి సమతులంగా ఉండటంలో టెస్టెస్టిరాన్ హార్మోన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే, కొన్ని అలవాట్లు అనారోగ్యాల కారణంగా పురుషుల్లో టెస్టెస్టిరాన్ హార్మోన్ స్థాయి తగ్గి అనారోగ్యాలకు కారణమవుతుంది (Low testesterone Hormone). అవేంటంటే..

Brain Tumor: ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే.. బ్రెయిన్ ట్యూమర్ ఉండే ఛాన్స్!


టెస్టెస్టిరోన్ స్థాయిలపై ఆహారం అధిక ప్రభావం చూపిస్తుంది. బేకరీలో దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్, మద్యం, చక్కెర, కొన్ని రకాల మూలికలు పురుషుల్లో ఈ హార్మోన్ స్థాయి తగ్గేలా చేస్తాయి,.

అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే, ఇది టెస్టెస్టిరాన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గితే ఆటోమేటిక్‌గా ఈ హార్మోన్ స్థాయి పెరుగుతుంది.

నిద్రలేమితో టెస్టెస్టిరాన్ స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి, పురుషులకు నిద్ర విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు.

డయామెటిస్, రక్తపోటుపై నియంత్రణ లేకపోతే టెస్టెస్టిరాన్ స్థాయిలు తగ్గుతాయి. హైబీపీ, కొలెస్టెరాల్ కూడా ఈ హార్మోన్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఈ లక్షణాలు ఉంటే టెస్టెస్టిరాన్ హార్మోన్ తగ్గుతున్నట్టు అనుమానించాల్సిందే

లైంగికాసక్తి తగ్గడం, ఎముకల సాంద్రత తగ్గడం, నిత్యం నీరసంగా ఉండటం, శక్తి లేనట్టు అనిపించడం, కండరాలు బలహీనపడటం, కండర పుష్టితగ్గడం, డిప్రెషన్, ఏకాగ్రత తగ్గడం వంటివి టెస్టెస్టిరాన్ హార్మోన్ తగ్గిందనేందుకు సంకేతాలని వైద్యులు చెబుతున్నారు. టెస్టెస్టిరాన్ హార్మోన్ తగ్గితే టైప్-2 డయాబెటిస్, హృద్రోగ సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వంటి వాటి బారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Read Health and Telugu News

Updated Date - Jul 15 , 2024 | 05:06 PM