Share News

Weight Loss: బరువు తగ్గాలా.. అన్నానికి బదులుగా ఇవి తీసుకోండి

ABN , Publish Date - Sep 23 , 2024 | 03:06 PM

సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం(Obesity). ఒక్కసారి దీని బారిన పడ్డామా ఇక అంతే సంగతులు. ఊబకాయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Weight Loss: బరువు తగ్గాలా.. అన్నానికి బదులుగా ఇవి తీసుకోండి

ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం(Obesity). ఒక్కసారి దీని బారిన పడ్డామా ఇక అంతే సంగతులు. ఊబకాయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే ఊబకాయం బారి నుంచి బయటపడటానికి చాలా మంది అనేక రకాల డైట్‌లు పాటిస్తుంటారు. బరువు తగ్గడం కోసం అన్నం తినడం మానేస్తారు. అన్నం తింటే బరువు పెరుగుతారని చాలా మంది దూరంగా ఉంటారు. అన్నానికి బదులుగా బరువు తగ్గడానికి ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ను నియంత్రించడానికి అన్నం స్థానంలో వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

డాలియా

రవ్వలో ఇంకో రకమే ఈ డాలియా. దీన్ని విరిగిన గోధుమలు అని కూడా అంటారు. 91 గ్రాముల డాలియాకు 76 కేలరీలు మాత్రమే లభిస్తాయి. అంటే వైట్ రైస్ కంటే 25 శాతం కేలరీలు తక్కువ అన్నమాట. శరీరానికి అందే పిండి పదార్థాలను తగ్గించడానికి, బరువు తగ్గడానికి డాలియా చాలా మంచిది.


క్వినోవా

దక్షిణ అమెరికాకు చెందిన క్వినోవా ఫిట్‌నెస్ ఔత్సాహికులలో ప్రజాదరణ పొందింది. చిన్న గింజలుగా ఉండే ఇవి గ్లూటెన్-రహితంగా ఉంటాయి. బియ్యం కంటే ఎక్కువ ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. మొత్తంగా తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇందులో రాగి, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

బార్లీ

పురాతన సాగు ధాన్యాలలో ఒకటైన బార్లీ, బియ్యం కంటే ఎక్కువ ప్రోటీన్లు, ఫైబర్‌ను అందిస్తుంది. విటమిన్ B, జింక్ , మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

కాలీఫ్లవర్ రైస్

కాలీఫ్లవర్ రైస్‌ శరీరానికి తక్కువ కేలరీలను అందిస్తుంది. దీన్ని రోజువారి ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.


బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్‌లో వైట్ రైస్ కంటే ఎక్కువ ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. బ్రౌన్ రైస్ అనేది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు బ్రౌన్ రైస్ చాలా మంచిది.

For Latest News and National News click here

Updated Date - Sep 23 , 2024 | 03:08 PM