Share News

Acidity: రోజూ ఈ ఒక్క పదార్థం తింటుంటే చాలు.. ఎసిడిటీ సమస్య పరార్..

ABN , Publish Date - Nov 04 , 2024 | 01:13 PM

ఎసిడిటీ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య వల్ల కడుపులో మంట, అసౌకర్యం, ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడతాయి.

Acidity: రోజూ ఈ ఒక్క పదార్థం తింటుంటే చాలు.. ఎసిడిటీ సమస్య పరార్..
Acidity

కడుపులో మంట.. చాలామంది ఈ మాట అనగానే అదేదో అసూయ, ద్వేషం నిండిన మనుషులను ఉద్దేశించినట్టు, అలాంటి వారికే ఇలా కడుపు మంట అనే సమస్య ఉన్నట్టు చెప్తుంటారు. కానీ కడుపు మంట అనేది చాలా సాధారణ సమస్య. ఇది ప్రత్యేకంగా వచ్చే జబ్బు ఏమీ కాదు.. కానీ తీసుకునే ఆహారం, తిన్న ఆహారం జీర్ణమయ్యే విధానం, కడుపులో ఉండే జీర్ణ రసాలు, కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను బట్టి సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా రక్తంలో ఆమ్లాలు, క్షారాలు సమపాళ్లలో ఉండాలి. లేకపోతే ఎసిడిటీ పమస్య వస్తుంది. ఈ ఎసిడిటీ సమస్యకు చాలామంది మందులు వాడుతుంటారు. మరికొందరు ఇంటి చిట్కాలను ట్రై చేస్తారు. అయితే ఇవన్నీ కాదు.. కేవలం ఒక్క పదార్థం తినడం వల్ల ఎసిడిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అదేంటో.. దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..

Health Tips: హ్యాంగోవర్ వేధిస్తుందా.. ఇలా చేస్తే మాయం..


పెరుగు..

పెరుగు తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. పెరుగులో ఉండే గుణాలు, ప్రోబయోటిక్స్ ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. పొట్టను శాంత పరుస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. ఈా కారణంగానే భోజనం చివర పెరుగును తీసుకోవాలనే నియమం పెట్టారు.

పోషకాలు..

పెరుగులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, సెలీనియం, విటమిన్-సి వంటి గుణాలు పెరుగులో ఉంటాయి.

Health Tips: ప్రాణాయామంలో ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే.. 100ఏళ్ళ ఆయుష్షు గ్యారెంటీ..


ఎలా పనిచేస్తుందంటే..

  • పెరుగులో పొట్టకు చల్లదనాన్ని ఇచ్చే గుణాలు ఉంటాయి. ఇవి పొట్టలో ఆమ్లాలు ఏర్పడకుండా చేస్తాయి. ఎసిడిటీ నివారించడంలో సహాయపడతాయి. ఆహారంలో పెరుగును రోజూ తీసుకుంటూ ఉంటే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.

  • అజీర్తి సమస్యను తగ్గించడంలో కూడా పెరుగు సహాయపడుతుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా అజీర్తిని తగ్గిస్తుంది. జీర్ణసామ్రర్థ్యాన్ని పెంచుతుంది.

ఇలా చేయకండి..

  • పెరుగు ఎసిడిటీ సమస్యకు మంచిదే కానీ.. రాత్రి సమయంలో పెరుగు తినడం మంచిది కాదు. పెరుగు శీతలీకరణ ప్రభావం కలిగి ఉంటుంది కాబట్టి పెరుగును రాత్రి తినకూడదు. ముఖ్యంగా చలికాలంలో అయితే అస్సలు తినకూడదు.

  • జలుబు, దగ్గు సమస్యలు ఉన్నప్పుడు పెరుగును తినడం మంచిది కాదు. ఈ సమస్యలున్నప్పుడు పెరుగు తినడం వల్ల అది సమస్యలను మరింత పెరిగేలా చేస్తుంది.

  • పెరుగు ఆరోగ్యానికి మేలు చేయాలంటే తాజాగా ఉన్న పెరుగును మాత్రమే తీసుకోవాలి. పుల్లబడిన పెరుగును తినడం వల్ల కడుపులో ఆమ్లాల ఉత్పత్తి మరింత పెరిగి ఎసిడిటీ, అజీర్తి సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెరుగు ఎంపిక చాలా కీలకం.

ఇవి కూడా చదవండి..

Health Tips: ఖర్జూరం విత్తనాల కాఫీ ఎప్పుడైనా తాగారా.. దీంతో ఎన్ని లాభాలంటే..

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 04 , 2024 | 01:13 PM