Share News

Almond Peels: నానబెట్టిన బాదం తిని తొక్కలు పడేస్తుంటారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!

ABN , Publish Date - Aug 10 , 2024 | 02:36 PM

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్న చాలామంది ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పు తినడంలో తమ రోజును ప్రారంభిస్తారు. బాదంపప్పును నానబెట్టి, తొక్క తీసిన తర్వాత తినడం అందరికీ అలవాటు. అయితే ..

Almond Peels:  నానబెట్టిన బాదం తిని తొక్కలు పడేస్తుంటారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!
almond peels

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్న చాలామంది ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పు తినడంలో తమ రోజును ప్రారంభిస్తారు. బాదంపప్పును నానబెట్టి, తొక్క తీసిన తర్వాత తినడం అందరికీ అలవాటు. అయితే బాదం పప్పులో ఉండే పోషకాలే బాదం తొక్కల్లో కూడా ఉన్నాయనే విషయం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. బాదంపప్పుల మాదిరిగానే ఈ తొక్కలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయట. ఇవి చాలా రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయట. బాదం యొక్క తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనే రసాయనం ఉండవచ్చు. ఇది ఆరోగ్యానికి హానికరం. అందుకే వీటిని నానబెట్టి తింటారు. అయితే బాదంను నానబెట్టినప్పుడు ఈ పైటిక్ యాసిడ్ పోతుంది. దీనివల్ల బాదం పప్పునే కాకుండా బాదం తొక్కలు కూడా తినవచ్చని అంటున్నారు. ఈ బాదం తొక్కలను ఎలా ఉపయోగించుకోవాలంటే..

తెలివైన వారు ఈ 5 విషయాలు ఎవరికీ చెప్పరట.. మరి మీరు..?



ప్రేగు కదలికలు..

బాదం తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది, ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటుంది. ఎండిన బాదం తొక్కలను అవిసె గింజలు, పుచ్చకాయ గింజలు, పంచదార లేదా బెల్లంతో కలిపి పొడిచేసి నిల్వచేసుకోవాలి. దీన్ని వేడి పాలతో ప్రోటీన్ పౌడర్ లాగా కలిపి తినవచ్చు. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేయడంలో సహాయపడుతుంది.

హెయిర్ మాస్క్..

బాదం తొక్కలతో హెయిర్ మాస్క్ చేసుకోవడం చాలా ఈజీ.. ఈ హెయిర్ మాస్క్‌ను తయారు చేయడానికి, ½ కప్పు బాదం తొక్కలను తీసుకుని 1 గుడ్డు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, కొద్దిగా తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇది హెయిర్ స్పా ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

Personality Test: మీ చెవుల ఆకారం, పరిమాణం మీలో ఉన్న లక్షణాలను బయటపెడుతుందట.. ఓ సారి చెక్ చేసుకోండి..!



స్నాక్స్..

1 కప్పు బాదం తొక్కలను తీసుకుని వాటిని బాగా కడిగి ఎండలో ఆరనివ్వాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టీస్పూన్ వెల్లుల్లి పొడి, 1 టీస్పూన్ ఉల్లిపాయ పొడి, ½ టీస్పూన్ మిరపకాయ, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఎండిన బాదం తొక్కలను ఇందులో కలపాలి. దీన్ని 5-10 నిముషాలు కరకరలాడే వరకు బేక్ చేసి తర్వాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి. వీటిని ఎప్పుడైనా తినవచ్చు.

Walking Vs Jogging: వాకింగ్ లేదా జాగింగ్.. బరువు తగ్గడానికి ఏది మంచిదంటే..!

Vakkaya: వాక్కాయ దొరికితే అస్సలు వదలకండి.. వీటిని తింటే ఎన్ని లాభాలు ఉంటాయంటే..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 10 , 2024 | 02:36 PM