Share News

Almonds: బాదం పప్పు ఎలా తింటే ఆరోగ్యం? మీకు తెలియని నిజాలివి..!

ABN , Publish Date - Aug 21 , 2024 | 09:56 AM

డైలీ బాదం పప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతారు. అయితే నానబెట్టిన బాదం పప్పును తొక్క తీసి తినడం చాలామంది చేసే పని. కానీ..

Almonds: బాదం పప్పు ఎలా తింటే ఆరోగ్యం?  మీకు తెలియని నిజాలివి..!
Almonds

బాదం పప్పు చాలామంది ఆహారంలో భాగం చేసుకుంటారు. రాత్రి నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నేతినడంతో రోజును మొదలు పెట్టేవారు ఎక్కువ. డైలీ బాదం పప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతారు. అయితే నానబెట్టిన బాదం పప్పును తొక్క తీసి తినడం చాలామంది చేసే పని. కానీ వీటిని తొక్క తీసే తినాలా? తొక్కతో సహా తినవచ్చా? ఆరోగ్యానికి బోలెడు బెనిఫిట్స్ కలగాలంటే బాదం పప్పును ఎలా తినాలో తెలుసుకుంటే..

గ్రీన్ టీని ఇలా తాగితే డబుల్ బెనిఫిట్స్ పక్కా..!


almond3.jpg

బాదం పప్పు చాలామంది ఇష్టంగా తినే నట్స్ లో ముఖ్యమైనవి. నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తొక్క తీసి తినడం చాలామంది ఆహారపు అలవాట్లలో భాగం. అయితే బాదం పప్పు తొక్క తీయకుండా కూడా తినవచ్చని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.

బాదం పప్పు మాత్రమే కాకుండా అన్ని రకాల డ్రై నట్స్ లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. డ్రై నట్స్ ను నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ పోతుంది. ఆ తరువాత నానబెట్టిన నట్స్ ను సాధారణంగానే తినవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.

ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా వాల్నట్స్ తినకూడదు..!


తొక్కతో సహా తింటే..

almond1.jpg

నానబెట్టిన బాదం తొక్కలలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ప్రేగు ఆరోగ్యం మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలని అనుకునేవారు నానబెట్టిన బాదం ను తొక్కతో సహా తినడం చాలామంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు.

బాదం తొక్కలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో పోరాడటంలో సహాయపడతాయి. ముఖ్యంగా పాలీఫెనాల్స్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక ప్రమాదాలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.

టీ ని మళ్ళీ వేడి చేసి తాగుతుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!


తొక్క తీసి తింటే..

almond2.jpg

నానబెట్టిన బాదం పప్పులకు పైన తొక్క తీసి తినడమే చాలామంది అలవాటు. ఇలా తొక్క తీసిన బాదం పప్పులను బ్లాంచ్డ్ బాదం అని పిలుస్తారు. బాదం పప్పు తొక్క తీసి తింటే ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి. సున్నితమైన జీర్ణవ్యవస్థ, జీర్ణశయాంతర సమస్యలు ఉన్న వ్యక్తులు బాదం పప్పులను తొక్క తీసి తినడమే మంచిది. వీటిని స్మూతీలు, క్రీములు, సాస్, సూపులు మొదలైనవాటిలో సులభంగా చేర్చుకోవచ్చు.

బాదం పప్పులను తొక్క తీయడం వల్ల బాదం మిల్క్ వంటివి తయారు చేయడం సులభంగా ఉంటుంది. వంటలకు మంచి రుచిని జోడిస్తాయి.

ఏది మేలు?

నానబెట్టిన బాదం ను తొక్కతో సహా తిన్నా, తొక్క తీసి తిన్నా రెండు విధాలు ఆరోగ్యమే.. అయితే రెండు మార్గాలలో కలిగే ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని వీటిని ఆహారంలో తీసుకోవాలి.

ఖాళీ కడుపుతో నానబెట్టిన జీడిపప్పు తింటే ఏం జరుగుతుందంటే..!

గులాబీ రేకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 21 , 2024 | 10:01 AM