Amla Vs Lemon: ఉసిరిజ్యూస్ లేదా నిమ్మ జ్యూస్.. బరువు తగ్గడానికి ఏ జ్యూస్ మంచిదంటే..!
ABN , Publish Date - May 06 , 2024 | 02:36 PM
ఉసిరికాయ జ్యూస్, నిమ్మ జ్యూస్ రెండూ సిట్రస్ పండ్లే.. అయితే నిమ్మకాయలు ఏ కాలంలో అయినా అందుబాటులో ఉంటాయి. కానీ ఉసిరికాయలు మాత్రం కేవలం సీజన్లోనే లభ్యమవుతాయి. ఈ రెండూ బరువు తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉన్నా.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..
బరువు తగ్గడానికి చాలా రకాల పానీయాలు తాగుతారు. వాటిలో ఉసిరికాయ జ్యూస్, నిమ్మ జ్యూస్ ముఖ్యమైనవి. ఇవి రెండూ సిట్రస్ పండ్లే.. అయితే నిమ్మకాయలు ఏ కాలంలో అయినా అందుబాటులో ఉంటాయి. కానీ ఉసిరికాయలు మాత్రం కేవలం సీజన్లోనే లభ్యమవుతాయి. ఈ రెండూ బరువు తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉన్నా.. రెండింటిలో ఏది బెస్ట్ ఫలితాలు ఇస్తుందో చాలామందికి తెలియదు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
ఉసిరికాయను అమలకి అని అంటారు. ఆయుర్వేదం దీన్ని అమృతఫలం అని పేర్కొంటుంది. జీర్ణశక్తిని, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుర్వేదంలో ఉసిరికాయ విరివిగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్గ్రీరాడికల్స్ తో పోరాడటానికి మద్దతు ఇస్తాయి. గుండె ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి కూడా ఉసిరికాయ జ్యూస్ మంచిదే.
గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే..!
నిమ్మకాయ చాలా సాధారణంగా వాడుతుంటారు. నిమ్మరసాన్ని నీటిలో కలిపి పానీయంగా వాడతారు.ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలోనూ, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. నిమ్మకాయలో ఉండే ఫెక్టిన్ ఫైబర్ పదే పదే ఆకలి వేయడాన్ని అరికడుతుంది. బరువు తగ్గించడంలో నిమ్మ జ్యూస్ బాగా పనిచేస్తుంది.
బరువు తగ్గాడనికి ఏది బెస్ట్..
బరువు తగ్గడానికి విటమిన్-సి చాలా బాగా సహాయపడుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. 100గ్రాముల నిమ్మకాయ రసంలో 53 మైక్రోగ్రాముల విటమిన్-సి ఉంటుంది. ఇక ఉసిరికాయ జ్యూస్ లో కూడా విటమిన్-సి శాతం ఎక్కువగానే ఉంటుంది. ఇవి బరువు తగ్గడంలో సరైన ఫలితాలు ఇవ్వాలంటే వీటిని తీసుకునే సమయం చాలా ముఖ్యం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీవక్రియను ప్రేరేపించి బరువు తగ్గడంలో సహాయపడుతాయి. అయితే నిమ్మరసంలోని యాసిడ్ గుణాలు పంటి ఎనామిల్ ను దెబ్బతీస్తాయి. అలాగే ఉసిరికాయలో ఎసిడిటి గుణాలు ఉంటాయి. ఇవి కూడా కడుపులో చికాకుకు కారణం అవుతాయి. ఈ విషయాలను పరిగణలో ఉంచుకుని వీటిని వాడాలి.
గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే..!
ప్రపంచంలోనే అరుదైన 7 జంతువులు ఇవీ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.