Health Tips: ఈ సమస్యల నుండి బయటపడాలంటే అంజీర్ పండ్లు తినాల్సిందే..!
ABN , Publish Date - Aug 21 , 2024 | 09:56 AM
Anjeer Benefits: అత్తిపండ్లు/అంజీర్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రుచికరంగానే కాక.. ఎంతో ఆరోగ్యకమైంది కూడా. దీనిని తినడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్స్, పొటిషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు సహా అనేక పోషకాలు ఉంటాయి.
Anjeer Benefits: అత్తిపండ్లు/అంజీర్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రుచికరంగానే కాక.. ఎంతో ఆరోగ్యకమైంది కూడా. దీనిని తినడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్స్, పొటిషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు సహా అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతాయి. అందుకే దీనిని ఆరోగ్య నిధి అంటారు. అంజీర్ పండ్ల తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. బరువు కూడా తగ్గుతారట. ముఖ్యంగా ఈ 4 అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు అంజీర్ పండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ 4 సమస్యలేంటి? అంజీర్ తింటే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఈ కథనంలో చూద్దాం..
మలబద్ధకం నుంచి ఉపశమనం..
అత్తి పండ్లలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. దీంతో జీర్ణక్రియ కూడా సరిగ్గా ఉంటుంది. అత్తి పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గొచ్చు..
బరువు తగ్గాలనుకుంటే.. రోజువారీ ఆహారంలో అత్తి పండ్లను చేర్చుకోవడం ఉత్తమం. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో మెటబాలిజం కూడా పెరుగుతుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది..
డయాబెటిక్ రోగులకు అంజీర్ పండ్లను తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నానబెట్టిన తర్వాత తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆకస్మిక బ్లడ్ స్పైక్‌ను నివారించడంలో సహాయపడుతుంది. అయితే, వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలి.
రక్తపోటు నియంత్రణ..
అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే.. మీ ఆహారంలో అత్తి పండ్లను చేర్చుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులోని పోషకాలు రక్త పోటు సమస్యను తగ్గిస్తాయి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.