Share News

Anti Aging Foods: 50ఏళ్ళలోనూ యవ్వనంగా కనిపించాలంటే తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవీ..!

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:13 PM

ఇప్పటికాలంలో 50ఏళ్లు దాటగానే ఇక వృద్దాప్యంలోకి అడుగు పెట్టినట్టే అంటుంటారు. కానీ 50ఏళ్ళ లోనూ యవ్వనంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తప్పనిసరి.

Anti Aging Foods: 50ఏళ్ళలోనూ యవ్వనంగా కనిపించాలంటే తీసుకోవాల్సిన ఫుడ్స్  ఇవీ..!

ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కాలానికి తల వంచక తప్పదు. మనిషి తన జీవితంలో ప్రతి దశను దాటుతూ వెళ్లాల్సిందే. కానీ వాస్తవం చెప్పాలంటే మనిషికి వృద్దాప్యమంటే నచ్చదు. ముడుతలు పడిన చర్మం, తెల్ల జుట్టు, బలహీనమైన శరీరం.. ఇలా వృద్దాప్యం కాస్తా మరణానికి ముఖ ద్వారంలా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికాలంలో 50ఏళ్లు దాటగానే ఇక వృద్దాప్యంలోకి అడుగు పెట్టినట్టే అంటుంటారు. కానీ 50ఏళ్ళ లోనూ యవ్వనంగా ఉండాలన్నా, శరీరాన్ని చుట్టు ముట్టే వృద్దాప్యాన్ని కాస్త నెమ్మది చేయాలన్నా కొన్ని ఆహారాలు సహాయపడతాయి. అవేంటో.. అవెలా సహాయపడతాయో తెలుసుకుంటే..

వయస్సు పెరిగే కొద్దీ దాని ప్రభావాన్ని ఆపడం కష్టం. కానీ కొన్ని టిప్స్ సహాయంతో వాటి ప్రభావాలను నెమ్మది చేయవచ్చు. యాంటీ ఏజింగ్‌గా చెప్పుకునే క్రీములు, మందులకు మార్కెట్‌లో ఎలాంటి కొరత లేకపోయినా, మనం తీసుకునే ఆహారంలో యాంటీ ఏజింగ్ ఫుడ్స్ చేర్చుకుంటే అవి కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఏర్పడటానికి సహాయపడతాయి. వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో కొల్లాజెన్ సహాయపడుతుంది. చర్మంలో కొల్లాజెన్‌ను కంటెంట్ ను పెంచడంలో సహాయపడే ఆహారాల గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ఇది కూడా చదవండి: ఐస్ క్రీం తిన్న తరువాత పొరపాటున కూడా ఇవి తినకండి!


ఆకుపచ్చ కూరగాయలు..

ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూర, మెంతికూర, బ్రోకలీ వంటి ఆకుపచ్చని కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తి అవుతుంది. కొల్లాజెన్ అనేది చర్మం, ఎముకలు, కండరాలు స్నాయువులలో పట్టుత్వాన్ని నిర్వహించడానికి సహాయపడే ప్రోటీన్. కొల్లాజెన్ వల్ల చర్మం మీద ముడతలు తగ్గుతాయి.

చేపలు, గుడ్డు..

సాల్మన్, మాకేరెల్ వంటి చేపలలో లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కొల్లాజెన్ ఏర్పడటానికి కూడా సహాయపడతాయి. ఇది వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో సహాయపడుతుంది. గుడ్డులో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కొల్లాజెన్ తయారీలో బిల్డింగ్ బ్లాక్‌లుగా పనిచేస్తాయి.

అవోకాడో, బెర్రీలు..

అవకాడో వంటి పండ్లు, బెర్రీలు శరీరంలో కొల్లాజెన్‌ను నిర్వహించడంలో సహాయపడతాయి. అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది చర్మానికి పోషణనిస్తుంది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 03 , 2024 | 04:14 PM