Apple Cider Vinegar: గోరువెచ్చని నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగితే ఇన్ని లాభాలా?
ABN , Publish Date - Jul 13 , 2024 | 02:00 PM
బరువు తగ్గడానికి శరీరంలో టాక్సిన్లు తొలగించుకోవడానికి చాలా రకాల చిట్కాలు పాటిస్తుంటారు. అలాంటి వాటిలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం కూడా తప్పకుండా చూసే ఉంటారు. అయితే..
బరువు తగ్గడానికి శరీరంలో టాక్సిన్లు తొలగించుకోవడానికి చాలా రకాల చిట్కాలు పాటిస్తుంటారు. అలాంటి వాటిలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం కూడా తప్పకుండా చూసే ఉంటారు. ఇది బరువు తగ్గడానికి, ఆకలిని తగ్గించడానికి,శరీరంలో టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుందని వైద్యులు, పరిశోధకులు అంటున్నారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ ను గోరువెచ్చని నీటితో తాగడం వల్ల అద్భుతమైన లాభాలుంటాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..
యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల నోటి దుర్వాసన, అన్ని రకాల అలర్జీలను దూరం చేసుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుతుంది.
Pumpkin Seeds: గుమ్మడి గింజలు ఇలా తింటే డబుల్ బెనిఫిట్స్ పక్కా..!
ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకపోతే యాపిల్ సైడర్ వెనిగర్ చేర్చుకోండి. యాపిల్ వెనిగర్ బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ ఎసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
మధుమేహం, డైస్లిపిడెమియా ఉన్న వ్యక్తులలో గ్లైసెమిక్ ఇండెక్స్, ఆక్సీకరణ ఒత్తిడిపై యాపిల్ సైడర్ వెనిగర్ చాలా గొప్ప ప్రభావాలను కలిగి ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
2021లో జరిగిన ఒక అధ్యయనం కూడా పెద్దలలో గ్లైసెమిక్ ఇండెక్స్ విషయంలో యాపిల్ సైడర్ వెనిగర్ చాలా మంచి ప్రభావం చూపుతుందని వెల్లడించింది.
జాపత్రిని ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలివే..!
బ్యాగులు, బాటిళ్లలో వచ్చే ఈ తెల్లని ప్యాకెట్లతో ఇన్ని లాభాలా?
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.