Share News

Apple Cider Vinegar: యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతుంటారా? ఈ 6 నష్టాలు తప్పవు..!

ABN , Publish Date - Jul 19 , 2024 | 01:18 PM

యాపిల్ సైడర్ వెనిగర్ ఈ మధ్యకాలంలో బరువు తగ్గడం కోసం చాలా మంది వినియోగిస్తున్న పానీయం. రోజూ ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి తాగుతుంటే పొట్ట కొవ్వు కరిగిపోతుందని, బరువు తగ్గుతారని చెబుతారు. అయితే..

Apple Cider Vinegar: యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతుంటారా? ఈ 6 నష్టాలు తప్పవు..!
Apple Cider Vinegar


యాపిల్ సైడర్ వెనిగర్ ఈ మధ్యకాలంలో బరువు తగ్గడం కోసం చాలా మంది వినియోగిస్తున్న పానీయం. రోజూ ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి తాగుతుంటే పొట్ట కొవ్వు కరిగిపోతుందని, బరువు తగ్గుతారని చెబుతారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గించడమే కాదు.. చాలా దుష్ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది. దాని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

జీర్ణవ్యవస్థ..

యాపిల్ సైడర్ వెనిగర్ ను ఎక్కువ రోజులు తీసుకుంటూ ఉంటే అది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. ఇందులో ఉండే అధిక ఆమ్లాలు కడుపు లైనింగ్ ను దెబ్బతీస్తాయి.

మెంతినీరు Vs తులసినీరు... ఖాళీ కడుపుతో ఏది తాగితే ఎక్కువ ఆరోగ్యం?


దంతాలు..

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే గాఢత దంతాల మీద ఉండే ఎనామిల్ దెబ్బతీస్తుంది. దంతాలను సెన్సిటీవ్ గా మారుస్తుంది.

మంట..

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే బలమైన యాసిడ్ లు గొంతు, కడుపులో మంట కలిగిస్తుంది. ఇది అల్సర్, గ్యాస్ట్రిక్ కు దారితీస్తుంది.

పొటాషియం లోపం..

యాపిల్ సైడర్ వెనిగర్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గుతాయి. ఇది కండరాల బలహీనత, గుండె కొట్టుకోవడంపై ప్రభావం చూపుతుంది.

ఈ పానీయాలు తాగితే చాలు.. చెడు కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది..


ఎముక సాంద్రత..

యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువగా తీసుకుంటే ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.

చర్మ సమస్యలు..

యాపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకుంటూ ఉంటే చర్మం చికాకు, అలర్జీలు, దద్దుర్లు వస్తాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఇది మంచిది కాదు.

మెంతి మొలకలు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?

ఈ పానీయాలు తాగితే చాలు.. చెడు కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 19 , 2024 | 01:18 PM