Arthritis: ఆర్థరైటిస్ సమస్యకు ఆయుర్వేదం చెప్పిన అదిరిపోయే చిట్కా..
ABN , Publish Date - Oct 20 , 2024 | 02:03 PM
ఆర్థరైటిస్ సమస్య ఈ కాలంలో చిన్న వయసు వారికే వస్తోంది. దీన్ని మొదట్లో గుర్తిస్తే ఆయుర్వేదం చెప్పిన సింపుల్ టిప్ తో ఈజీగా తగ్గించుకోవచ్చు.
ఆర్థరైటిస్.. ఈ మధ్య కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారిలో కీళ్ల నొప్పులు, కీళ్లు దృఢంగా లేకపోడం, కీళ్ల చుట్టూ కండరాలు నొప్పిగా, వాపుతో ఉండటం జరుగుతుంది. ఆర్థరైటిస్ లక్షణాలు ఎక్కువగా చేతులు, మోకాళ్లు, తుంటి, వెన్నెముక వంటి స్థానాలలో కనిపిస్తాయి. ప్రారంభంలో ఆర్థరైటిస్ సమస్యను గుర్తించి ఆయుర్వేదం చెప్పిన అద్భుతమైన చిట్కా పాటిస్తే సమస్య మటుమాయం అవుతుందట. అదేంటో తెలుసుకుంటే..
Health Tips: అరటిపండును పాలతో తినడం ఇష్టమా.. ఇదెంత చెడ్డ అలవాటంటే..
ఆర్థరైటిస్ కు ఆయుర్వేదంలో చాలా రకాల చికిత్సలు ఉన్నాయి. వాటిలో చాలా సింపుల్ గా ఉన్నది చింత గింజల వైద్యం. చింత గింజలు కీళ్ల లూబ్రికేషన్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చింతగింజలలో టానిన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
ఆయుర్వేద వైద్యుల సిఫారసు మేరకు చింత గింజల పొడిని నిర్ణీత మోతాదులో ఉపయోగించడం వల్ల ఆర్థరైటిస్ సమస్య నుండి చాలా వరకు ఉపశమనం ఉంటుంది. దీంతో పాటు ఆర్థరైటిస్ నొప్పి ఉన్న ప్రాంతంలో వేడి కాపడం లేదా కోల్డ్ కాపడం పెట్టడం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వంటివి ఆర్థరైటిస్ నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి. యోగా, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు కీళ్లను దృఢంగా చేయడంలో సహాయపడతాయి.
Health Tips: మల్బరీ పండ్లు ఎప్పుడైనా తిన్నారా.. వీటితో ఎన్ని లాభాలంటే..
ఫిజియోథెరపీ కూడా ఆర్థరైటిస్ నొప్పిని, సమస్య నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. శరీర కదలికల సమయంలో నొప్పి లేకుండా ఉండటంలో ఫిజియోథెరపీ సహాయపడుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఏ రకమైన వైద్యం అయినా తొందరగా పనిచేసి ఆర్థరైటిస్ సమస్య నయం కావాలన్నా, సమస్య నుండి తొందరగా ఉపశమనం కావాలన్నా బరువు అదుపులో ఉండాలి. అధిక బరువు కీళ్ల మీద ఒత్తిడి పెంచుతుంది. ఆర్థరైటిస్ సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.
ఇవి కూడా చదవండి..
నారింజ తొక్కల గురించి మీకు తెలియని నిజాలివి..
ఈ పండ్లు తినండి రక్తంలో చక్కెర స్థాయిలకు చెక్ పెట్టచ్చు..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.