Share News

Asafoetida: వంటల్లో వాడే ఇంగువ వల్ల ఇన్ని లాభాలున్నాయని తెలిస్తే..

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:46 AM

అసలు ఇంగువను వంటల్లో వాడితే వాసన తప్ప ఆరోగ్య పరంగా ఏం లాభాలుంటాయనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది.

Asafoetida: వంటల్లో వాడే ఇంగువ వల్ల ఇన్ని లాభాలున్నాయని తెలిస్తే..

ఇంగువ చాలా వరకు వంటల్లో వాడతారు. ముఖ్యంగా సాంప్రదాయ వంటకాలు ఇంగువ లేకుండా తయారుచేయరు. ఇంగువతో పోపు పెట్టిన వంట సువాసన ఇనుమడిస్తుంది. అసలు ఇంగువను వంటల్లో వాడితే వాసన తప్ప ఆరోగ్య పరంగా ఏం లాభాలుంటాయనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. ఇంగువ వల్ల ఆహారానికి రుచి, సువాసనే కాదు.. బోలెడు ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. వంటల్లో వాడే ఇంగువ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే..

జీర్ణ సమస్యలు..

ఇంగువ జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. పేగు కండరాలను సడలించడం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలోనూ, ప్రేగు ప్రకోప సిండ్రోమ్ సమస్యను, అపానవాయువు సమస్యను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్ లను ప్రేరేపిస్తుంది. తిన్న ఆహారం నుండి శరీరం పోషకాలను శోషించుకోవడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: ఈ 8 కొరియన్ డ్రింక్స్ ఎంత పవరంటే.. బరువును ఐస్ లా కరిగిస్తాయ్..!


యాంటీ ఇన్ఫ్లమేటరీ..

ఇంగువలో క్రోమైన్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కర్భన సమ్మేళనం. ఇది నొప్పులు, వాపులు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల శరీర కణాలకు కలిగే నష్టం నుండి కాపాడతాయి. వాపులు, నొప్పులు, మంటను తగ్గిస్తాయి.

శ్వాసకోశ సమస్యలు..

సాంప్రదాయ వైద్యంలో ఆస్తమా, బ్రోన్కైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి ఇంగువను ఉపయోగిస్తారు. దీని ఎక్స్‌పెక్టరెంట్ లక్షణాలు కఫం, శ్లేష్మాన్ని రిలీజ్ చేస్తాయి. కపాన్ని శ్వాసకోశం నుండి సులభంగా బయటకు వెళ్లేలా చేస్తాయి. ఆహారంలో ఇంగువను తీసుకోవడం లేదా గోరువెచ్చని నీటితో ఇంగువ తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

మైక్రోబయల్ రియాక్షన్..

ఇంగువలో మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్లతో సహా ఇతర వ్యాధికారకాలతో పోరాడుతుంది. ఇంగువ సహజ యాంటీ బయాటిక్ గా పనిచేస్తుంది. ఇంగువను రోజూ తీసుకుంటూ ఉంటే ఇమ్యునిటీ సిస్టమ్ ను బలోపేతం చేస్తుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నెలసరి సమస్యలు..

నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే అసౌకర్యాలను పరిష్కరించడంలో కూడా ఇంగువ పనిచేస్తుంది. నెలసరిలో వచ్చే తిమ్మిరి తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇంగువలో ఉండే యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు గర్భాశయ కండరాలను సడలించడంలో సహాయపడతాయి. ఋతుస్రావం సమయంలో నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.

ఇది కూడా చదవండి: రాత్రి పూట పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2024 | 11:46 AM