Banana: ఇలాంటి వారు అరటిపండు తినకూడదు.. తింటే ఈ ప్రమాదం తప్పదు..
ABN , Publish Date - Dec 09 , 2024 | 10:02 AM
అరటిపండ్లు పరిమిత పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే, ఈ వ్యాధితో బాధపడేవారు ఉదయాన్నే అరటిపండు తినడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Bananas: ఊబకాయం ఉన్నవారు అరటిపండ్లు తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తింటే, శరీరానికి అదనపు కార్బోహైడ్రేట్లు, కేలరీలు అందుతాయని.. ఇది బరువు పెరుగుటకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. బరువు సమస్యతో బాధపడేవారు ఉదయం తినకూడదని, రోజంతా ఒక అరటిపండు కంటే ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు.
కడుపు సమస్యలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తింటే మీ శరీరంలో చక్కెర స్థాయిని పెంచే అవకాశం ఉంది. దీంతో మీరు త్వరగా అలసిపోయినట్లుగా భావిస్తారు. కడుపు సమస్యలు పెరగవచ్చు. నిజానికి అరటపండులో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. వాంతులు, కడుపు నొప్పితో పాటు అనేక ఇతర సమస్యలు సంభవించవచ్చు. మీరు దీన్ని తప్పనిసరిగా తినవలసి వస్తే, ఇతర ఆహారాలతో తినండి.
మధ్యాహ్నం మేలు..
అరటిపండు చాలా తక్కువ ధరకే వస్తుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరానికి శక్తిని ఇస్తుంది. బరువు పెరగాలనుకునే వారు ఈ పండును ఎక్కువగా తీసుకుంటారు. అయితే, చాలా మంది ఆరోగ్య నిపుణులు ఉదయం ఖాళీ కడుపుతో ఈ పండును తినడానికి నిరాకరిస్తారు. ఒక వేళ మీకు తినాలి అనిపిస్తే మీరు మధ్యాహ్నం అరటిపండు తినడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీకు నీరసంగా అనిపిస్తే, అరటిపండు మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. దీంతో మీ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది.
(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)