Share News

Beetroot: బీట్ రూట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయి.. ఈ నిజాలు తెలుసుకోండి..!

ABN , Publish Date - Sep 28 , 2024 | 12:11 PM

బీట్రూట్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయట. కొందరికి బీట్ రూట్ తినడం హాని చేస్తుంది.

Beetroot: బీట్ రూట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయి.. ఈ నిజాలు తెలుసుకోండి..!
Beetroot

బీట్ రూట్ ఒక దుంప కూరగాయ. దీనిలో ఉండే ఎరుపు రంగు కారణంగా ఇది రక్తహీనత ఉన్నవారికి చాలా మేలు చేస్తుందని అంటారు. బీట్ రూట్ ను జ్యూస్ చేసుకుని ప్రతి రోజూ తీసుకుంటూ ఉంటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని చెబుతారు. అంతేకాదు బీట్ రూట్ జ్యూస్ ను డైలీ తాగుంటే కాంతి వంతమైన చర్మం సొంతమవుతుంది. ముఖం మెరుస్తుంది. అయితే బీట్రూట్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయట. కొందరికి బీట్ రూట్ తినడం హాని చేస్తుంది. దీని గురించి తెలుసుకుంటే..

యూట్యూబ్ షార్ట్స్ నుండి డబ్బు ఎలా సంపాదించవచ్చు తెలుసా?


  • బీట్ రూట్ లలో ఆక్సలేట్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొందరిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. ముఖ్యంగా తమ వంశంలో కిడ్నీలో రాళ్లు వచ్చే సమస్య ఉన్నా, అప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నా బీట్ రూట్ తినకూడదు.

  • అలెర్జీ సమస్యలు ఉన్నవారు బీట్రూట్ ను జాగ్రత్తగా తీసుకోవాలి. ఏమాత్రం తేడా జరిగినా చర్మం పై ఎరుపు, దురద, వాపులు వంటి సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా దుంప కూరగాయలతో అలెర్జీ ఉన్న వారు బీట్ రూట్ ను తీసుకోకపోవడం మంచిది.

  • బీట్ రూట్ ను ఆహారంలో తీసుకోక పోయినా కొందరు దీన్ని జ్యూస్ రూపంలో డైలీ తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటారు. కానీ జీర్ణకోశ సమస్యలున్నవారు డైలీ దీన్ని తాగితే కడుపునొప్పి, గ్యాస్, డయోరియా వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

Health Tips: ఈ ఒక్క డ్రింక్ తాగండి చాలు.. జలుబు, దగ్గు నుండి ఎంత వేగంగా కోలుకుంటారంటే..!

ఖాళీ కడుపుతో ఉదయాన్నే పసుపు నీటిని రోజూ తాగితే ఏం జరుగుతుందంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 28 , 2024 | 12:11 PM