Share News

BP: ఈ ఆహారాలతో జాగ్రత్త.. ఇవి బీపీని అమాంతం పెంచేస్తాయ్..!

ABN , Publish Date - Jul 27 , 2024 | 07:44 AM

రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ ను షార్ట్ కట్ లో బీపీ అని పిలుస్తుంటారు. ఒకప్పుడు బీపీ అనేది వయసు పెరిగిన వారిలో వచ్చే సమస్య. కానీ నేటికాలంలో పెద్ద చిన్న తేడా లేకుండా బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆహారాలతో ఈ సమస్య మరింత పెరుగుతుంది.

BP: ఈ ఆహారాలతో జాగ్రత్త.. ఇవి బీపీని అమాంతం పెంచేస్తాయ్..!
High BP

రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ ను షార్ట్ కట్ లో బీపీ అని పిలుస్తుంటారు. ఒకప్పుడు బీపీ అనేది వయసు పెరిగిన వారిలో వచ్చే సమస్య. కానీ నేటికాలంలో పెద్ద చిన్న తేడా లేకుండా బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ వయసు పిల్లలలో కూడా అధిక రక్తపోటు సమస్య బయట పడటం ఆందోళనకు గురిచేస్తున్న అంశం. బీపీ ని చాలా వరకు తీసుకునే ఆహారం ద్వారా నియంత్రణలో పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అధిక బీపీ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలు తినకపోవడం మంచిదని చెబుతుంటారు. ఊరగాయలు , పచ్చళ్లు తింటే బీపీ పెరుగుతుందని చెప్పడం వినే ఉంటారు. కానీ వాటి కంటే ఎక్కువగా బీపీని ప్రభావితం చేసే ఆహారాలు అందరూ తింటున్నారు. అవేంటో తెలుసుకొని వాటిని దూరంగా ఉంచడం చాలా అవసరం.

ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!


ఫ్రెంచ్ ఫ్రైస్..

ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఈ కాలంలో చిన్న, పెద్ద అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా వీటిని కెచప్ తో తినడం మరింత ఇష్టపడతారు. వీటిని నూనెలో ఎక్కువసేపు వేయించడం వల్ల అందులో కొవ్వులు, ఉప్పు పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా రక్తపోటు పెరుగుతుంది.

జంక్ ఫుడ్..

జంక్ ఫుడ్ ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇవి చాలా రుచిగా ఉండటం వల్ల రుచుల కోసం ఆరాటపడేవారు ముందు వెనుక ఆలోచించకుండా వీటిని తినేస్తుంటారు. వీటిలో సోడియం, కొవ్వులు, కేలరీలు ఎక్కువ. ఇవి బీపీని పెంచుతాయి.

వైద్యులు చెప్పిన నిజాలు.. ఈ ఆల్కహాల్ రకాలు చాలా హెల్తీ..!


హాట్ డాగ్స్..

ఫారనర్లు ఎక్కువగా తినే ఆహారాలలో సోడియం, నైట్రేట్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా చికెన్ తో తయారు చేసే హాట్ డాగ్ లో ఇవి అధికం. ఇది బీపీ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. గొప్పలకు, రుచికి పోయి వీటిని తింటే హై బీపీ ముప్పు తప్పదు.

స్వీట్స్, క్యాండీలు..

మార్కెట్లో లభ్యమయ్యే స్వీట్లు, క్యాండీలలో అధిక చక్కెర వినియోగిస్తారు. చక్కెర ఎక్కువ తీసుకోవడం కూడా బీపీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వీటిని తీసుకునేవారు అధిక బీపిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటికి దూరంగా ఉండటం మంచిది.

బరువు తగ్గాలనుకునే వారికోసం భలే టిఫిన్లు.. వీటిలో కేలరీలు చాలా తక్కువ..!


చిప్స్..

ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే బంగాళదుంపతో తయారుచేసిన చిప్స్ లో అధిక మొత్తంలో కొవ్వులు ఉంటాయి. ఉప్పు కూడా అధికంగా ఉంటుంది. ఇది బీపీ ప్రమాదాన్ని పెంచుతుంది.

పిజ్జా..

పిజ్జా చాలామందికి ఇష్టమైన ఆహారం. ఇది రక్తపోటును చాలా దారుణంగా పెంచుతుంది. ఇందులో ఉండే సోడియం, కొవ్వులు, కేలరీలు రక్తపోటు పెరగడానికి కారణం అవుతాయి.

మెచ్యురిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి..!

మార్కెట్లో దొరికే A1, A2 నెయ్యి మధ్య తేడాలేంటి?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 27 , 2024 | 07:46 AM