Share News

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా మంది మహిళలకు తెలియని 5 లక్షణాలు ఇవి..!

ABN , Publish Date - Sep 06 , 2024 | 09:41 AM

రొమ్ము క్యాన్సర్ గురించి చాలా అవగాహన కల్పిస్తున్నప్పటికీ చాలామంది మహిళలకు తెలియని రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కొన్ని ఉన్నాయి.

Breast Cancer:  బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా మంది మహిళలకు తెలియని 5 లక్షణాలు ఇవి..!
Breast-Cancer

ప్రపంచ వ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే సమస్యలలో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ చాప కింద నీరులా చేరి పెద్ద సమస్యగా మారేవరకు బయట పడదు. ఈ కారణంగా చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్ కు బలవుతూ ఉంటారు. రొమ్ము క్యాన్సర్ గురించి చాలా అవగాహన కల్పిస్తున్నప్పటికీ చాలామంది మహిళలకు తెలియని రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కొన్ని ఉన్నాయి. వీటి గురించి ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాలి. అవేంటంటే..

శరీరానికి ఎంతగానో ఉపయోగపడే ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాలు ఇవే..!


చర్మంలో మార్పులు..

రొమ్ము మీద చర్మం మసకబారడం, గట్టిపడటం వంటి మార్పులకు లోనైతే అది రొమ్ము క్యాన్సర్ కు సంకేతం కావచ్చు. కొన్ని సార్లు రొమ్ము చర్మం నారింజ తొక్కను పోలి ఉంటుంది. రొమ్ములో కణుతులు ఏర్పడటం వల్ల చర్మంపై ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి.

నొప్పి..

రొమ్ము లేదా చనుమొనలో భరించలేని నొప్పి వస్తే అది రొమ్ము క్యాన్సర్ కు సంకేతంగా చెప్పవచ్చు. అయితే సాధారణంగా మహిళలలో నెలసరి సమయాలలో ఇలా జరుగుతూ ఉంటుంది. నెలసరి లేని సాధారణ సమయాలలో కూడా మహిళలలో ఇలాంటి నొప్పి ఉన్నా, రొమ్ములో కేవలం ఒక ప్రాంతంలోనే నొప్పి రావడం వంటివి జరిగితే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఉల్లిపాయ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య లాభాల లిస్ట్ ఇదీ..!


చనుమొన..

చనుమొనలో మార్పులు కూడా రొమ్ము క్యాన్సర్ ను సూచిస్తాయి. చనుమొన లోపలికి కుచించుకున్నట్టు లేదా అది పొడుచుకు వచ్చినట్టు కాకుండా చదునుగా మారినట్టు ఉంటే దాన్ని రొమ్ము క్యాన్సర్ కు సంకేతంగా పరిగణించవచ్చు. కొందరికి వయసుతో పాటూ ఇలాంటివి చోటు చేసుకున్నా ఇతర లక్షణాల మీద ఇది ఆధారపడి ఉంటుంది.

రొమ్ము ఎరుపు..

రొమ్ము మీద ఎరుపు లేదా వాపు వస్తే దాన్ని ఇన్పెక్షన్ అని తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది. కానీ అది ఇన్‌ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణంగా పరిగణిస్తారు. ఈ స్థితిలో రొమ్ము క్యాన్సర్ తీవ్రరూపంలో ఉంటుంది.

మూత్రం రంగు ఆరోగ్యం గురించి ఏం చెబుతుందంటే..!


స్రావాలు..

చనుమొనల నుండి స్రావాలు కారడం, ముఖ్యంగా రక్తంతో కూడిన స్రావాలు కారడం జరిగినా, చనుమొనను పిండకుండానే ఇలాంటి స్రావాలు కారుతున్నా రొమ్ము క్యాన్సర్ కు సంకేతం. కొన్ని సార్లు వేరే ఇతర కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. కానీ వైద్యుడిని సంప్రదించకుండా దీన్ని లైట్ తీసుకోకూడదు.

ఇవి కూడా చదవండి..

ఉసిరికాయ తింటే ఈ 7 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!

ఈ 6 రకాల విత్తనాలను నానబెట్టిన తర్వాతే తినాలి.. ఎందుకంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 06 , 2024 | 09:41 AM