Share News

Calcium: పాల కంటే 8రెట్ల కాల్షియం ఉన్న గింజలు.. రోజూ ఓ స్పూన్ తింటే ఎముకలు ఉక్కులా మారడం ఖాయం..

ABN , Publish Date - Nov 13 , 2024 | 01:38 PM

ఎముకలు ఎప్పుడూ బలంగా ఉండటానికి ఆయుర్వేదం రికమెండ్ చేసిన గింజలను తీసుకోవాలని చెబుతున్నారు. ఈ గింజలలో పాల కంటే 8 రెట్లు కాల్షియం ఉంటుందట.

Calcium: పాల కంటే 8రెట్ల కాల్షియం ఉన్న గింజలు.. రోజూ ఓ స్పూన్ తింటే ఎముకలు ఉక్కులా మారడం ఖాయం..
Clcium

కాల్షియం శరీరానికి చాలా అవసరం. శరీరానికి తగిన కాల్షియం అందితేనే శరీరంలో ఎముకలు బలంగా ఉంటాయి. అదే కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనంగా తయారవుతాయి. అంతేకాదు దీర్ఘకాలం కాల్షియం లోపిస్తే.. ఎముకలు పెళుసు బారి బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పాలు, పాల ఆధారిత పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలని చెబుతుంటారు. ఎముకలు ఎప్పుడూ బలంగా ఉండటానికి ఆయుర్వేదం రికమెండ్ చేసిన గింజలను తీసుకోవాలని చెబుతున్నారు. ఈ గింజలలో పాల కంటే 8 రెట్లు కాల్షియం ఉంటుందట. ఇంతకీ అవేంటో.. వాటి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

కార్తీక పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే దైవ కృప ఖాయం..


చియా..

చియా విత్తనాలలో ప్రోటీన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది.ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి.

రాజ్ గిరా..

రాజ్ గిరా విత్తనాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చుతుంది. ఇందులో కాల్షియంతో పాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.

గుమ్మడి..

గుమ్మడి గింజలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒకటి నుండి రెండు స్పూన్ల గుమ్మడి విత్తనాలలో గ్లాసుడు పాలలో ఉన్న కాల్షియంకు సమాన కాల్షియం ఉంటుంది. వీటిని రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.

ఈ ఒక్క పండు తింటుంటే చాలు.. కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చట..


మునగ ఆకులు..

మునగ ఆకులలో ఐరన్ అధికంగా ఉంటుందని చెబుతారు. అయితే ఐరన్ మాత్రమే కాదు.. కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. మునగ ఆకులలో పాల కంటే 10 రెట్ల కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కూడా మెరుగ్గా ఉంటుంది.

తెల్ల నువ్వులు..

పాలు తాగే అలవాటు లేనివారికి కాల్షియం సమృద్దిగా అందాలంటే ప్రతి రోజూ ఒక స్పూన్ తెల్ల నువ్వులు తినడం చాలా హెల్ప్ చెస్తుంది. స్పూన్ నువ్వులలో గ్లాసుడు పాలకంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి..

Cholesterol: ఆయుర్వేదం చెప్పిన చిట్కా.. ఈ పానీయాన్ని తాగితే చాలు.. కొలెస్ట్రాల్ దానంతట అదే తగ్గిపోతుంది..

Hair Growth Gummies: మార్కెట్లో ట్రెండ్ అవుతున్న హెయిర్ గ్రోత్ గమ్మీస్.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారుచేసుకోండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 13 , 2024 | 01:38 PM