Talc: రోజూ ముఖానికి పౌడర్ రాసుకుంటారా? అయితే మీకో అలర్ట్!
ABN , Publish Date - Jul 07 , 2024 | 09:06 PM
పౌడర్ వినియోగానికి అండాశయ క్యాన్సర్‌కు లంకె ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విభాగం ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కాన్సర్ పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: మీరు రోజూ పౌడర్ రాసుకుంటారా? అయితే మీకో అలర్ట్! పౌడర్ వినియోగానికి సంబంధించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ విభాగం ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కాన్సర్ (ఐఏసీఆర్) కీలక ప్రకటన చేసింది. పౌడర్ (Talc Powder) వినియోగానికి అండాశయ క్యాన్సర్‌కు లంకె ఉండే అవకాశం ఉందని పేర్కొంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు, పౌడర్‌కు మధ్య సంబంధంపై ఓ అధ్యయనం తరువాత ఈ అంచనాకు వచ్చింది (Health).
Health: స్త్రీపురుషులు వేర్వేరు సమయాల్లో ఎక్సర్‌సైజులు చేయాలా?
ప్రకృతి సిద్ధంగా లభించే మినరల్ టాల్క్. దీన్ని పౌడర్ల తయారీలో అధికంగా వినియోగిస్తారు. బేబీ పౌడర్లు, ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీలో దీన్ని వాడతారు. అయితే, టాల్క్ ఆధారిత ఉత్పత్తుల తయారీలో భాగంగా వ్యక్తులు టాల్క్ ప్రభావానికి ఎక్కువగా లోనవుతారని పేర్కొంది. అయితే, టాల్క్‌తో క్యాన్సర్‌కు సంబంధం ఉండే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని మాత్రమే ఐఏఆర్‌సీ పేర్కొందని యూకే ఓపెన్ యూనివర్సిటీకి చెందిన గణాంక శాస్త్రవేత్త కెవిన్ మెకాన్వే పేర్కొన్నారు.
అసలేమిటీ అండాశయ క్యాన్సర్
మహిళలకు అత్యధికంగా సోకే క్యాన్సర్లలో అండాశయ లేదా ఒవేరియన్ క్యాన్సర్ ఎనిమిదో స్థానంలో ఉంది. దీనికి సైలింట్ కిల్లర్ అని పేరు. వ్యాధి ముదిరే వరకూ రోగ లక్షణాలు బయటపడని కారణంగా శాస్త్రవేత్తలు దీనికి ఆ పేరు పెట్టారు. ఒవేరియన్ క్యాన్సర్లలో ప్రధానంగా ఎపిథీలియల్, స్ట్రోమల్ సెల్, జర్మ్ సెల్ అని మూడు రకాలు ఉంటాయి.
మహిళలు తమ ఉదరానికి దిగువ భాగంలో నొప్పి, ఇబ్బంది, ఉబ్బెత్తుగా ఉన్నట్టు అనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. బ్లీడింగ్ అసాధారణంగా ఉన్నా, విరేచనాలు, మలబద్ధకం, ఉదరభాగం సైజు పెరిగినట్టు ఉండటం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.