Share News

Mushroom: పుట్టగొడుగుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..?

ABN , Publish Date - Jun 30 , 2024 | 12:13 PM

పుట్టగొడుగులకు ఉన్న (మష్రూమ్స్‌) విశిష్టమైన రుచి వల్ల శాకాహారులకూ ఇష్టమైన ఆహారంగా మారింది. రుచిగా ఉండటమే కాక, అద్భుతమైన పోషక విలువలు కలిగి ఉన్నాయి. పుట్టగొడుగుల్లో క్యాలరీలు, కొవ్వులు చాలా మితంగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు ఉండే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువే. పరిమిత క్యాలరీల వలన అధిక మొత్తంలో తీసుకొన్నా బరువు తగ్గేందుకు ఇవి ఉపయోగపడతాయి.

Mushroom: పుట్టగొడుగుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..?
Mushrooms

పుట్టగొడుగుల వల్ల ప్రయోజనాలేంటి?

అన్ని వయసుల వారూ పుట్టగొడుగులు తినవచ్చా?

వారానికి ఎన్నిసార్లు పుట్టగొడుగులు తీసుకోవాలి?


పుట్టగొడుగులకు ఉన్న (మష్రూమ్స్‌) విశిష్టమైన రుచి వల్ల శాకాహారులకూ ఇష్టమైన ఆహారంగా మారింది. రుచిగా ఉండటమే కాక, అద్భుతమైన పోషక విలువలు కలిగి ఉన్నాయి. పుట్టగొడుగుల్లో క్యాలరీలు, కొవ్వులు చాలా మితంగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు ఉండే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువే. పరిమిత క్యాలరీల వలన అధిక మొత్తంలో తీసుకొన్నా బరువు తగ్గేందుకు ఇవి ఉపయోగపడతాయి. వండేప్పుడు నూనె తక్కువ వాడితేనే క్యాలరీలను నియంత్రించడం వీలవుతుంది. పుట్ట గొడుగుల్లో పీచుపదార్థాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేయడానికి ఈ పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. శరీరానికి ఎంతో అవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌, బీ 6, విటమిన్‌ డీ, పొటాషియం, ఫాస్పరస్‌, కాపర్‌, జింక్‌, సిలీనియం లాంటి పోషకాలు పుట్టగొడుగులలో పుష్కలం. వీటికి వయస్సు పెరుగుదలను నియంత్రించడం, క్యాన్సర్‌ను నిరోధించి రోగనిరోధకశక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. సాధారణంగా అన్ని వయసుల వారు నిస్సంకోచంగా పుట్టగొడుగులను తినవచ్చు. అందుబాటును బట్టి వారానికి మూడుసార్లకు పైగా తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. జంతు సంబంధిత ఆహారం కాదు కాబట్టి శాకాహారులు కూడా వీటిని తరచూ తీసుకొని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు.

Updated Date - Jun 30 , 2024 | 12:13 PM