Share News

Chia Seeds: ఆరోగ్యానికి మంచిదని చియా సీడ్స్ వాటర్ బాగా తాగుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!

ABN , Publish Date - Sep 05 , 2024 | 02:44 PM

చియా సీడ్స్ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్న గింజలు. వీటిని నీటిలో నానబెట్టి ఫుడ్డింగ్ గానూ, ఓట్స్ లోనూ, నీటిలోనూ తీసుకుంటూ ఉంటారు. బరువు తగ్గడానికి , ఫిట్ గా ఉండటానికి వాడుతుంటారు. అయితే..

Chia Seeds: ఆరోగ్యానికి మంచిదని చియా సీడ్స్ వాటర్ బాగా తాగుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!
Chia Seeds

చియా సీడ్స్ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్న గింజలు. వీటిని నీటిలో నానబెట్టి ఫుడ్డింగ్ గానూ, ఓట్స్ లోనూ, నీటిలోనూ తీసుకుంటూ ఉంటారు. బరువు తగ్గడానికి , ఫిట్ గా ఉండటానికి వాడుతుంటారు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని చియా సీడ్స్ ను తెగ వాడేవారికి బ్యాడ్ న్యూస్.. చియా సీడ్స్ గురించి ఆహార నిపుణులు చెప్పిన నిజాలు ఏంటంటే..


Weight Loss: బరువు తగ్గడానికి ఏ జ్యూసులు తాగితే మంచిది? ఫిట్‌నెస్ నిపుణులు చెప్పిన నిజాలివీ..!



  • చియా సీడ్ వాటర్ ను రోజూ తీసుకుంటే జీర్ణక్రియ పాడవుతుంది. దీంతో పాటూ అలెర్జీలు కూడా రావచ్చు. ఇప్పటికే పేలవమైన జీర్ణక్రియ, అలెర్జీ సమస్యలు ఉన్నవారు చియా సీడ్స్ ను తీసుకోకపోవడమే మంచిది.

  • చియా సీడ్స్ లో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో నీటిని ఎక్కువగా గ్రహిస్తుంది. వీటి పరిమాణం కంటే 10 నుండి 12 రెట్లు ఎక్కువ నీటిని ఇవి గ్రహిస్తాయి. చియా సీడ్ వాటర్ ను ఎక్కువగా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది.


ఈ ఆహారాలు తీసుకోండి చాలు.. విటమిన్-డి లోపం మిమ్మల్ని టచ్ చేయదు..!



  • చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కడుపులో గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

  • చియా గింజలలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయట. వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే శరీరంలో కేలరీల పరిమాణం కూడా పెరుగుతుందట.

ఇవి కూడా చదవండి..

ఉల్లిపాయ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య లాభాల లిస్ట్ ఇదీ..!

మూత్రం రంగు ఆరోగ్యం గురించి ఏం చెబుతుందంటే..!

ఉసిరికాయ తింటే ఈ 7 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 05 , 2024 | 02:44 PM