Share News

Cinnamon Water: వంటల్లో వాడే దాల్చిన చెక్క గురించి షాకింగ్ నిజాలు.. రోజూ దాల్చిన నీరు తాగితే.. !

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:00 PM

వంటింటి మసాలా దినుసుల్లో దాల్చినచెక్క కూడా ఒకటి. ఇది వంటకు రుచిని, సువాసనను మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. సాంప్రదాయ వైద్యంలో దాల్చినచెక్కను వినియోగిస్తుంటారు. తీపి, కారం కలయిక కలిగిన రుచితో ఇది చాలా గొప్ప ఓదార్పును ఇస్తుంది.

Cinnamon Water:  వంటల్లో వాడే దాల్చిన చెక్క గురించి షాకింగ్ నిజాలు.. రోజూ దాల్చిన నీరు తాగితే.. !
Cinnamon Water

వంటింటి మసాలా దినుసుల్లో దాల్చినచెక్క కూడా ఒకటి. ఇది వంటకు రుచిని, సువాసనను మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. సాంప్రదాయ వైద్యంలో దాల్చినచెక్కను వినియోగిస్తుంటారు. తీపి, కారం కలయిక కలిగిన రుచితో ఇది చాలా గొప్ప ఓదార్పును ఇస్తుంది. దాల్చిచెక్క గొప్ప యాంటీ ఆక్సిడెంట్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఇందులో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ సమృద్దిగా ఉంటాయి. శరీర కణాలకు హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి శరీర కణాలను రక్షించడమే కాకుండా శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో దాల్చిన చెక్క ప్రభావవంతంగా ఉంటుంది. ప్రతిరోజూ దాల్చిన చెక్క నీరు తాగుతుూ ఉంటే షాకింగ్ ఫలితాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..

High Protein: ప్రోటీన్ శరీరానికి అవసరమే.. కానీ దీన్ని ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?



  • దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి మెదడు సంబంధ జబ్బులైన అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి జబ్బుల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. కొందరికి వయసు పెరడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు వస్తాయి. వీటికి దాల్చిన చెక్క మంచి ఔషదంగా పనిచేస్తుంది. రోజూ దాల్చిన చెక్క నీరు తాగుతుంటే ఈ ప్రమాదం తగ్గుతుంది.

  • నేటికాలంలో కడుపుకు సంబంధించిన సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. వాటిలో ఉబ్బరం, గ్యాస్ సమస్యలు ప్రధానమైనవి. ఇవి అజీర్ణం కారణంగా వస్తాయి. అయితే అజీర్ణాన్ని తగ్గించి, జీర్ణక్రియను ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో దాల్చిన చెక్క అధ్బుతంగా సహాయపడుతుంది. రోజూ ఒక కప్పు దాల్చిన చెక్క నీరు తాగితే జీర్ణ సమస్యలే ఉండవు.

Mosquito's: ఈ 3 రకాల దోమల వల్ల ప్రమాదకర వ్యాధులు వస్తున్నాయి.. అవేంటంటే..!



  • వాపులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గాలంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలు బాగా తీసుకోవాలి. దాల్చిన చెక్క యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారం. రోజూ ఒక గ్లాసు దాల్చిన చెక్క నీరు తాగుతూ ఉంటే ఆర్థరైటిస్, వాపులు, కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.

  • చాలామంది వెయిట్ లాస్ డైట్ లో దాల్చిన చెక్కను చేర్చుకోమని సలహా ఇస్తారు. శరీరంలో ఉండే అదనపు కొవ్వులను బర్న్ చేయడంలో కొవ్వులను విచ్చిన్నం చేయడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. బరువు తగ్గడాన్ని సులభం చేస్తుంది.

  • వర్షాకాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్లు ఎదుర్కోవడంలోనూ, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలోనూ దాల్చిన చెక్క బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్క నీరు క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ వర్షాకాలంలో సేఫ్ గా ఉండవచ్చు. అంతేకాదు దాల్చిన చెక్క నీరు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. గుండెల్లో మంటను, గుండె జబ్బులను తగ్గిస్తుంది.

స్పాట్ జాగింగ్ ఇంత పవరా? రోజూ 10నిమిషాలు చేస్తే ఏం జరుగుతుందంటే..!


ఈ 6 ఆహారాలను రాత్రంతా నానబెట్టిన తరువాతే తినాలి.. ఎందుకంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 02 , 2024 | 04:34 PM