Share News

Coffee: ఈ 6 రకాల వ్యక్తులు ఉదయాన్నే కాఫీని పొరపాటున కూడా తాగకూడదట..!

ABN , Publish Date - Aug 03 , 2024 | 09:08 PM

ఉదయాన్నే ఘుమఘమలాడే కాఫీని సిప్ చేయంది పనులు మొదలు పెట్టేవారు తక్కువ. అయితే కాఫీని అందరూ తాగడం మంచిది కాదట. ముఖ్యంగా 6 రకాల వ్యక్తులు

Coffee: ఈ 6 రకాల వ్యక్తులు ఉదయాన్నే కాఫీని పొరపాటున కూడా తాగకూడదట..!
Coffee

కాఫీ భారతీయులకు ఒక ఎమోషన్. టీ అయితే ఈ మధ్య కాలంలో తెగ తాగేస్తున్నారు. అది కూడా పెద్ద నగరాలలో, యూత్ మాత్రమే ఎక్కువగా తాగుతుంటారు. కానీ పెద్దవాళ్లు, పాత సాంప్రదాయలు పాటించేవాళ్లు, గ్రామాల్లో నివసించేవారు ఇప్పటికీ కాఫీని వదల్లేదు. ఉదయాన్నే ఘుమఘమలాడే కాఫీని సిప్ చేయంది పనులు మొదలు పెట్టరు కూడా. అయితే కాఫీని అందరూ తాగడం మంచిది కాదట. ముఖ్యంగా 6 రకాల వ్యక్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఆరోగ్యానికి పెద్ద రిస్కే అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

Oats Vs Poha: ఓట్స్ లేదా అటుకులు.. ఆరోగ్యానికి ఏవి మంచివి? పోషకాహార నిపుణులు చెప్పిన షాకింగ్ నిజాలు..!



అధిక రక్తపోటు..

అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అస్సలు మంచిది కాదట. ఇది రక్తపోటు స్థాయిలను ఇంకా పెంచే అవకాశం ఉంటుందట.

పొట్ట సమస్యలు...

నేటికాలం ఆహారం, జీవనశైలి, మసాలా ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం, వేళకు తినకపోవడం వంటి వాటి వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు చాలామందే అనుభవిస్తున్నారు. వాటిలో గ్యాస్, ఎసిడిటీ, అపానవాయువు, కడుపు ఉబ్బరం మొదలైనవి ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీని తాగడం మంచిది కాదని అంటున్నారు. దీని వల్ల సమస్యలు మరింత పెరుగుతాయట. పేగు ఆరోగ్యం దెబ్బ తింటుందట.

నిద్రలేమి..

నిద్రలేమి సమస్య ఉన్నవారు ఉదయాన్నే కాఫీ తాగకూడదు. ఎప్పుడైనా నిద్ర వస్తుంది అంటే కొందరు కాఫీ తాగి నిద్రను అనుచుకుంటారు. కాఫీలో ఉండే కెఫీన్ నిద్రను నియంత్రిస్తుంది. ఇప్పటికే నిద్రలేమితో, నిద్ర సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు కాఫీ తాగకపోవడమే మంచిది.

Pears Vs Diabetes: మధుమేహం ఉన్నవారికి పియర్స్ పండ్లు చేసే మేలు ఎంత? ఈ నిజాలు తెలిస్తే..!



ఎముకలు..

ఎముకల ఆరోగ్యం మీద కాఫీ ప్రభావం చూపిస్తుంది. కాఫీలో ఉండే కెఫీన్ ఐరన్, కాల్షియం వంటి పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఈ కారణంగా ఐరన్, కాల్షియం ఆధారిత ఆహారాలు తీసుకున్నా అవి శరీరానికి అందవు. దీనివల్ల బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్, ఎముకలు బలహీనంగా మారడం వంటి సమస్యలు వస్తాయి.

ఒత్తిడి..

ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏదైనా తినడం, తాగడం కొందరి అలవాటు. ఇలాంటి వారు చాలా వరకు కాఫీని రిఫర్ చేస్తుంటారు. అయితే ఒత్తిడి ఎక్కువ ఉన్నవారు కాఫీ తాగకూడదు. ఇది సమస్యను మరింత పెంచుతుంది.

కొలెస్ట్రాల్..

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడేవారు కాఫీ తీసుకోకూడదు. ఎందుకంటే కాఫీ చెడు కొలెస్ట్రాల్ పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Hair Growth: ఈ ఆహారాలు తినండి చాలు.. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడం ఖాయం..!

ఈ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో జుట్టు రాలడం ఆగిపోతుంది..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 03 , 2024 | 09:08 PM