Share News

cooking Facts: నూనె లేకుండా కేవలం ఆవితోనూ, ఉడికించి వంట చేసుకుంటే ఏం జరుగుతుంది?

ABN , Publish Date - Jul 22 , 2024 | 12:24 PM

ఆహారమే ఆరోగ్యం అని వైద్యుల నుండి పెద్దల వరకు అందరూ చెప్పారు. ఆహారం వండే విధానం మీద అందులో పోషకాల పరిమాణం ఆధారపడి ఉంటుంది. అందుకే ఆహారాన్ని వండే విధానం కూడా చాలా ముఖ్యం అన్నారు. అయితే..

cooking Facts:  నూనె లేకుండా కేవలం ఆవితోనూ,  ఉడికించి వంట చేసుకుంటే ఏం జరుగుతుంది?
stream and boil food

ఆహారమే ఆరోగ్యం అని వైద్యుల నుండి పెద్దల వరకు అందరూ చెప్పారు. ఆహారం వండే విధానం మీద అందులో పోషకాల పరిమాణం ఆధారపడి ఉంటుంది. అందుకే ఆహారాన్ని వండే విధానం కూడా చాలా ముఖ్యం అన్నారు. అయితే ఇప్పట్లో వంటల్లో నూనెను అధికంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల ఆహారానికి ఉన్న సహజమైన రుచి మారిపోతుంది. ఆహారాన్ని నూనె లేకుండా ఆవిరితోనూ, ఉడికించి తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

రక్తంలో చక్కెరను, చెడు కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గించే నేచురల్ డ్రింక్స్ ఇవి..!


  • నూనెతో వండే వంటల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది అధిక కొలెస్ట్రాల్, అధిక బరువుకు కారణమవుతాయి. అదే నూనె లేకుండా కేవలం ఆవిరి మీద లేదా నీటిలో ఉడికించిన ఆహారం తీసుకుంటే కేలరీలు తక్కువ, కొలెస్ట్రాల్ అసలు పెరగదు.

  • నూనె లేకుండా కేవలం ఆవిరి మీద లేదా నీటిలో ఆహారాన్ని ఉడికించి తింటూ ఉంటే గుండె ఆరోగ్యం ఊహించని విధంగా మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం వల్ల గుండె పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది.

  • ఆవిరి మీద లేదా నీటిలో ఆహారాలను ఉడికించడం వల్ల ఆహార పదార్థాలలో పోషకాల నష్టం తగ్గుతుంది. ఈ రకమైన వంట పద్దతిలో ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ కోల్పోవు. తద్వారా ఈ ఆహారం తింటే శరీరానికి ఎక్కువ లాభాలు ఉంటాయి.

రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే.. కాలేయ సమస్యలున్నట్టే..!


  • అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారికి ఆవిరి వంట చాలా మంచిది. వంటకోసం నూనెను మినహాయించి ఆవిరి పద్దతిలో ఆహారాన్ని వండుకుని తింటే బరువు తగ్గడం సులువుగా ఉంటుంది.

  • నీటిలో లేదా ఆవిరి మీద ఉడికించిన ఆహారం తింటే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఈ రకమైన ఆహారం తినడం వల్ల జీర్ణాశయం మీద భారం తగ్గుతుంది.

  • చాలామందికి నూనెలో వేయించిన ఆహారాలు రుచిగా అనిపిస్తాయి. కానీ ఆహారాన్ని నీటిలో ఉడికించి లేదా ఆవిరి మీద ఉడికించి తినడం ద్వారా ఆహారానికి సహజమైన రుచి లభిస్తుంది. ముఖ్యంగా వివిధ రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలతో వండినప్పుడు ఈ రుచి మెరుగ్గా ఉంటుంది.

  • ఆవిరి మీద లేదా నీటిలో వంట చేయడం వల్ల వంటనూనె కొనుగోలు అవసరం తగ్గుతుంది. ఇది క్రమంగా డబ్బును ఆదా చేస్తుంది.

గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన పండ్లు, కూరగాయల లిస్ట్ ఇదీ..!

ఈ 5 డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే అస్సలు తినకూడదు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 22 , 2024 | 12:24 PM