USA: గోళ్లపై ఈ గీతలున్నాయా.. అయితే యమ డేంజర్
ABN , Publish Date - May 19 , 2024 | 05:23 PM
శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని తెలియజేస్తాయి. అలాగే గోళ్ల ద్వారా కూడా ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఫొటోలో చూపిన విధంగా గోళ్లపై నిలువు గీతలుంటే చాలా ప్రమాదమని అంటున్నారు.
అమెరికా: శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని తెలియజేస్తాయి. అలాగే గోళ్ల ద్వారా కూడా ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఫొటోలో చూపిన విధంగా గోళ్లపై నిలువు గీతలుంటే చాలా ప్రమాదమని అంటున్నారు. US ఆధారిత సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ లిండ్సే జుబ్రిట్‌స్కీ అరుదైన చర్మ క్యాన్సర్ గురించి హెచ్చరించారు.
గోళ్లకు నిలువు గీత ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని, అది చర్మ క్యాన్సర్ సంభవించడానికి దారి తీస్తుందని సూచించారు. ఎందుకంటే ఇది subungual melanomaకు సంకేతమని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సదరు వీడియోను షేర్ చేశారు. ఈ రకమైన మెలనోమా ప్రపంచవ్యాప్తంగా 0.7% నుంచి 3.5% మందిలో ఉంటుంది.
గోళ్లపై నల్లటి గీతలు ప్రమాదకరమైనవి నొక్కిచెప్పారు. వేలు తలుపులో చిక్కుకోవడం లేదా అనుకోకుండా సుత్తితో వేలిపై కొట్టడం వల్ల కలిగే గాయంతో గోరు కింద రక్తం పేరుకుపోయినప్పుడు సబింగువల్ హెమటోమా సంభవిస్తుంది. సబింగువల్ హెమటోమా, సబింగువల్ మెలనోమా మధ్య తేడాలను జుబ్రిట్ చెప్పారు.
కాలక్రమేణా గోరు పెరుగుతుంది కాబట్టి హెమటోమాలు తగ్గిపోతాయని.. గోళ్లపై ఎంతకూ నల్లటి నిలువు గీతలు తగ్గకపోతే వైద్యసాయం తీసుకోవాలని సూచించారు. అలాంటి గీతలు సబింగువల్ మెలనోమాకు సూచన కావచ్చని హెచ్చరించారు.
సబింగువల్ మెలనోమా లక్షణాలు..
గాయం లేకుండా గోరులో నలుపు లేదా గోధుమ రంగు గీతలు.
కాలక్రమేణా పెద్దవిగా మారే గోరు చారలు.
గోళ్లు తిరిగి పెరగకపోవడం
గోరు చుట్టూ ఉన్న చర్మం నల్లబడటం.
గోరు చుట్టూ రక్తస్రావం జరగడం.
గోరు మందం సన్నబడటం. పగుళ్లు రావడం.
Climate Change: ఆ వ్యాధిగ్రస్తులకు వాతావరణ మార్పు ముప్పు.. లాన్సెట్ జర్నల్ నివేదికలో ఆందోళనకర విషయాలు
Read Latest National News and Telugu News