Share News

Diabetes: పండుగల సమయంలో షుగర్ పెరగకూడదంటే డయాబెటిస్ ఉన్నవారు ఇలా చేయాలి..

ABN , Publish Date - Oct 26 , 2024 | 03:18 PM

పండుగ సమయాల్లో షుగర్ పెరగకూడదు అంటే మధుమేహం ఉన్నవారు ఇలా చేయాలి.

Diabetes: పండుగల సమయంలో షుగర్ పెరగకూడదంటే డయాబెటిస్ ఉన్నవారు ఇలా చేయాలి..
Diabetes

పండుగలు సంతోషంతోనే కాదు.. రుచికరమైన ఆహారంతో కూడా ముడిపడి ఉంటాయి. పండుగ రోజుల్లో ప్రతి భారతీయ ఇంట్లో బోలెడు రకాల వంటలు తయారు చేసుకుంటారు. ముఖ్యంగా తీపి పదార్థాలను తప్పనిసరిగా చేస్తారు. ఇంటిల్లిపాది ఈ తీపి పదార్థాలు తినడం ఆనవాయితీగా ఉంటుంది. కానీ మధుమేహం ఉన్న వ్యక్తులకు ఈ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. పండుగ సందర్భాలలో ఇంటి భోజనమే భారీగా ఉంటుంది. ఇక చక్కెర, బెల్లం జోడించిన పదార్థాలను తినడం వల్ల మధుమేహం ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరుగుతాయి. అందుకే మధుమేహం ఉన్నవారు పండుగ ఆహారం విషయంలో జంకుతుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే మధుమేహ రోగులు కూడా పండుగ తీపిని ఎంజాయ్ చేయవచ్చు.

Black Tea: బ్లాక్ టీ.. ఇలా తాగితే ఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగిపోద్ది..


పండుగ వేళలో చక్కెర స్థాయి..

గత కొన్నేళ్ళ గణాంకాలు పరిశీలిస్తే పండుగల సీజన్ లో మధుమేహం ఉన్న వ్యక్తులలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం పండుగ సమయాల్లో వండిన భారీ భోజనాన్ని తినడమే. ఈ కారణంగా మధుమేహ రోగులు పండుగ రోజుల్లో తీపి పదార్థాలు తినవచ్చా వద్దా అనే సందిగ్ధం నెలకొంది.

రక్తంలో చక్కెర సమస్య ఉన్నవారు లేదా ఇన్సులిన్ తీసుకునేవారు షుగర్ స్థాయిని పెంచే ఏ విధమైన పదార్థాలను తినకూడదు. స్వీట్లు, కార్బోహైడ్రేట్లు లేదా చక్కెరతో కూడిన పదార్థాలు మధుమేహ సమస్యను పెంచుతాయి. పండుగ సమయంలో రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంచడానికి ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం తీసుకోవాలి. శారీరకంగా చురుకుగా ఉండటం, రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ముఖ్యం.

Coconut Oil Vs Ghee: కొబ్బరి నూనె లేదా నెయ్యి.. జుట్టు పెరుగుదలకు ఏది మంచిదంటే..


పంచదారకు బదులు బెల్లం, డ్రై ఫ్రూట్స్‌తో చేసిన స్వీట్లను మితంగా తీసుకోవచ్చు. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా స్వీట్లు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి. రోజంతా పుష్కలంగా నీరు త్రాగటం ముఖ్యం. ఇది చక్కెరను నియంత్రించడాన్ని సులభతరం చేస్తుంది. శుద్ధి చేసిన పిండికి బదులుగా తృణధాన్యాల పిండితో తయారుచేసిన వంటలను తీసుకోవాలి.

వేయించిన స్నాక్స్, స్వీట్లకు బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోవాలి. స్వీట్లకు బదులు డ్రై ఫ్రూట్స్, బెల్లం కలిపి తయారుచేసిన వాటిని తినండి.

పండుగల సమయంలో వ్యాయామం మానేయకూడదు. షుగర్ నియంత్రణలో ఉంచుకోవడానికి శారీరకంగా చురుకుగా ఉండటం ముఖ్యం. చక్కెర స్థాయిని తనిఖీ చేస్తూ ఉండాలి. చక్కెర స్థాయిలు పెరిగినట్టు అనిపిస్తే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి..

Weight Loss: ఈ 6 టిప్స్ ఫాలో అవ్వండి చాలు.. కిలోల కొద్ది బరువు ఈజీగా తగ్గుతారు..

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 26 , 2024 | 04:03 PM