BreakFast: ఉదయాన్నే ఇవి తింటే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు..
ABN , Publish Date - Dec 28 , 2024 | 09:38 AM
ఉదయం పూట అల్పాహారంలో పూరి, వడ, బోండా వంటి ఆయిల్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా బరువు పెరగకుండా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థాలు, క్యాల్షియం వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మనం రోజువారీ కార్యక్రమాలు చేసేందుకు అది ఎంతో శక్తినిస్తుంది. పని మీద పడి ఉదయం అల్పాహారం తీసుకోకుండా ఉండడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అయితే అలా అని ఏది పడితే అది తింటామంటే కుదరదు. ఎక్కువ మంది బ్రేక్ ఫాస్ట్‌లో ఆయిల్ ఫుడ్ తినేందుకు ఇష్టపడతారు. అప్పుడప్పుడు అయితే పర్వాదేదు, కానీ రోజు తింటే మాత్రం ఆస్పత్రి పాలుకావడం తథ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉదయం పూట అల్పాహారంలో పూరి, వడ, బోండా వంటి ఆయిల్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా బరువు పెరగకుండా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థాలు, క్యాల్షియం వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి. తేలికగా అరిగే ఇడ్లీ వంటివి తినాలి. అంతేకాని ప్రతి రోజూ ఆయిల్ ఫుడ్ తినకూడదు. అలా చేస్తే శరీర మెటబాలిజం తగ్గిపోతుంది. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఆయిల్ ఫుడ్ తినే వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. హార్ట్ ఎటాక్స్, ఫ్యాటీ లివర్, షుగర్, క్యాన్సర్ వంటి అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. శరీరం పనితీరు మందగించి బద్దకం అనిపిస్తుంది. ఏ పనీ చేయాలని అనిపించదు. మరోవైపు బయట దొరికే ఆయిల్ ఫుడ్ చాలా ప్రమాదకరం. హోటల్ వాళ్లు వాడిన నూనెనే పదేపదే వాడుతుంటారు. నాసిరకం, కల్తీ నూనెలు సైతం వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయిల్ ఫుడ్ తినాలనుకుంటే ఇంట్లో చేసుకోవడం ఉత్తమం.