Share News

Water: రాత్రి పూట ఈ నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు..

ABN , Publish Date - Nov 17 , 2024 | 02:51 PM

చాలా మంది ఉదయం నిద్ర లేవగానే చేసే మొదటి పని నీరు తాగడం. కొందరు సాధారణ నీరు తాగుతారు. మరికొందరు గోరువెచ్చని నీరు తాగుతారు. అయితే, రాత్రి పూట ఈ నీళ్లు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Water: రాత్రి పూట ఈ నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు..
water

Water: రాత్రి పడుకునే ముందు వేడినీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే.. వేడి నీరు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కొంతమందికి రాత్రిపూట భోజనం చేసినా నిద్ర సరిగా పట్టదు. కడుపులో ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఈ వేడి నీటిని తాగితే తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.


ఒత్తిడి తగ్గుతుంది..

వేడి నీరు మన శరీరంలోని నాడీ వ్యవస్థను కూడా రిలాక్స్ చేస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ప్రస్తుతం చాలా మంది పని ఒత్తిడితో బాధపడుతున్నారు. అలాంటివారు పడుకునే ముందు వేడినీళ్లు తాగితే ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్రపోవచ్చు.


పీరియడ్స్ పెయిన్ తగ్గుతుంది..

స్త్రీలకు ప్రతి నెలా పీరియడ్స్ వస్తుంటాయి. ఆ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. అలాంటి సమయాల్లో రాత్రి పడుకునే ముందు వేడినీళ్లు తాగితే నొప్పి తగ్గుతుంది. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అంతే కాదు వేడినీళ్లు గొంతునొప్పి సమస్యలను కూడా తగ్గిస్తాయి.


టాక్సిన్స్ తొలగిపోతాయి..

పడుకునే ముందు వేడినీళ్లు తాగితే... పళ్లలో అంటుకున్న క్రిములను తొలగిపోయి దంతాలు శుభ్రంగా ఉంటాయి. వేడి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకెందుకు ఆలస్యం ఇక నుంచి రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగడం మరిచిపోకండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)


Also Read:

‘వందే భారత్‌’ రైలు ఆహారంలో బొద్దింకలు

రాజధానిలో దారుణం.. ఐదో రోజు అదే వాయు కాలుష్యం, బతికేదేలా..

నోటి పుండ్లను నివారిద్దామిలా!

For More Health News

Updated Date - Nov 17 , 2024 | 02:51 PM