Share News

Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ సమస్యలు పక్కా

ABN , Publish Date - Jun 07 , 2024 | 10:43 AM

నీరు సమస్తకోటికి ప్రాణాధారమని మనందరికీ తెలుసు. మానవ శరీరం కూడా 70 శాతం నీటితోనే(Drinking Water) నిర్మితమై ఉంటుంది. భూమిపై ఉన్న సమస్త జీవులు జీవించడానికి పూర్తిగా నీటిపైనే ఆధారపడతాయి.

Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ సమస్యలు పక్కా

ఇంటర్నెట్ డెస్క్: నీరు సమస్తకోటికి ప్రాణాధారమని మనందరికీ తెలుసు. మానవ శరీరం కూడా 70 శాతం నీటితోనే(Drinking Water) నిర్మితమై ఉంటుంది. భూమిపై ఉన్న సమస్త జీవులు జీవించడానికి పూర్తిగా నీటిపైనే ఆధారపడతాయి. కానీ మానవ శరీరంలో నీటి శాతం తగినంతగా లేనప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతాం.

మీ శరీరంలోని ప్రతి అవయవం సజావుగా పనిచేయాలంటే, రోజుకి 2 నుండి 3 లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతుంటారు. అయితే నీరు ఎలా తాగాలో మీకు తెలుసా? ఇదేం పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా. చాలా మంది ఈ మధ్య కాలంలో నిల్చొనే నీరు తాగేస్తున్నారు. పరిగెత్తి పాలు తాగడం కన్నా, నిలబడి నీళ్లు తాగాలని ఓ సామెత ఉంది. అలా నిలబడి నీరు తాగితే ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం.


కిడ్నీ సమస్యలు: నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులైతే నిలబడి నీళ్లు తాగవద్దు.

ఆర్థరైటిస్ సమస్యలు: కీళ్లనొప్పులు ఉన్నవారు నిలబడి నీళ్లు తాగకూడదు. అలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయి.

ఊపిరితిత్తుల సమస్యలు: నిలబడి నీరు తాగడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. తద్వారా ఊపిరితిత్తులపై చెడు ప్రభావం పడుతుంది.

జీర్ణక్రియ: నిలబడి నీరు తాగితే జీర్ణవ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో నొప్పిగా ఉంటుంది.

మరి ఎలా తాగాలి..

కూర్చొని నీరు తాగాలి. ఒకేసారి నీళ్లు తాగే బదులు చిన్న చిన్న గుటకలుగా మింగాలి. నెమ్మదిగా నీటిని తాగడం ద్వారా, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌గా ఉంటాయి. శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలు అందుతాయి.

For Latest News and National News click here

Updated Date - Jun 07 , 2024 | 11:05 AM