Dry Ice: డ్రై ఐస్ తిని అస్వస్థకు గురైన కస్టమర్స్.. అసలు డ్రై ఐస్ అంటే ఏంటి? ఇది ప్రాణాంతకమా?
ABN , Publish Date - Mar 05 , 2024 | 10:43 PM
Dry Ice Effects: ఇటీవల గురుగ్రామ్‌లోని ఒక రెస్టారెంట్‌లో( Gurugram Restaurant) కొందరు వ్యక్తులు చాలా సంతోషంగా ఫుడ్ తినేందుకు వచ్చారు. కడుపునిండా భోజనం చేశారు. అప్పటి వరకు అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ, చివరలో ఒక పదార్థం తిన్న వెంటనే రక్తపు వాంతులు చేసుకున్నారు. వారి పరిస్థితి చాలా సీరియస్‌గా మారింది. దాంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Dry Ice Effects: ఇటీవల గురుగ్రామ్‌లోని ఒక రెస్టారెంట్‌లో( Gurugram Restaurant) కొందరు వ్యక్తులు చాలా సంతోషంగా ఫుడ్ తినేందుకు వచ్చారు. కడుపునిండా భోజనం చేశారు. అప్పటి వరకు అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ, చివరలో ఒక పదార్థం తిన్న వెంటనే రక్తపు వాంతులు చేసుకున్నారు. వారి పరిస్థితి చాలా సీరియస్‌గా మారింది. దాంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంత క్రిటికల్‌గా మారడానికి కారణం డ్రై ఐస్(Dry Ice). రెస్టారెంట్‌లో ఆహారం తిన్న తరువాత కస్టమర్లకు మౌత్ ఫ్రెషనర్‌కు బదులుగా డ్రై ఐస్ ఇచ్చారు సిబ్బంది. అది తిన్న వెంటనే వారు రక్తం కక్కుతూ వాంతులు చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రై ఐస్ అంటే ఏంటి?
డ్రై ఐస్‌ని.. సాలిడ్ కార్బన్ డై ఆక్సైడ్ అని కూడా అంటారు. కార్బన్ డై ఆక్సైడ్ ఘనరూపం డ్రై ఐస్. ఇది చాలా కూల్‌గా ఉంటుంది. సాధారణంగా మంచు ఉష్ణోగ్రత మైనస్ 2-3 డిగ్రీలు ఉంటుంది. డ్రై ఐస్ ఉష్ణోగ్రత మైనస్ 80 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది సాధారణ మంచులా తడిగా ఉండదు. దీన్ని తాకడం కూడా నిషేధం. ఒకవేళ దీనిని తాకితే పూర్తిగా పొడిగా ఉంటుంది. మంచు గడ్డ సాధారణ ఉష్ణోగ్రత వద్ద కరిగిపోతే.. ఈ డ్రై ఐస్ మాత్రం ఉష్ణోగ్రత పెరిగితే నీరుగా మారకుండా ఆవిరి అయిపోతుంది.
డ్రై ఐస్ ఎలా తయారవుతుంది?
ఈ మంచును తయారు చేయడానికి కార్బన్ డయాక్సైడ్ 109 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉష్ణోగ్రతలను తగ్గిస్తారు. దీని కారణంగా కార్బన్ డై ఆక్సైడ్ మంచులా మారుతుంది. అది చిన్న ముక్కలుగా మారుతుంది.
ఎక్కడ వాడతారు..
ఈ డ్రై ఆక్సైడ్‌ను శీతలీకరణ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. ఇది వైద్యంలో, ఆహార పరిశ్రమలో ఉపయోగిస్తారు. ఫోటో షూట్‌లలో కూడా సాధారణ మంచుకు బదులుగా డ్రై ఐస్ ఉపయోగిస్తారు.
డ్రై ఐస్ ప్రమాదకరమా?
ఇది కార్బన్ డయాక్సైడ్ మాత్రమే అయినప్పటికీ.. అంత ప్రమాదకరమైనది కాదు. కానీ, ఇది చాలా చల్లగా ఉంటుంది. దీనిని తింటే.. శరీరంలోని కణాలు త్వరగా చచ్చుబడిపోతాయి. అందుకే.. దీనిని చేతి తొడుగులు లేకుండా తాకడం నిషేధం. ఇక దీనిని తినడం, మింగండం కూడా ప్రమాదకరం. ఇది తింటే తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది.
వైద్యులు ఏం చెబుతున్నారు?
ఇది ఒకరకమైన కార్బన్ డై ఆక్సైడ్ అయినప్పటికీ.. దానిని తినడం వలన బాధిత వ్యక్తుల్లో నరాలు దెబ్బతిన్నాయని, దాని వల్ల రక్త వాంతులు అయ్యాయని రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు చెబుతున్నారు. దీనిని శీతలీకరణ ఏజెంట్‌గా మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. దానిని తినడం లేదా మింగడం నిషేధం.