Share News

Early Dinner: చక్కని ఆరోగ్యానికి అద్బుతమైన అలవాటు.. రాత్రి సమయంలో ఇదొక్కటి ఫాలో అయ్యారంటే మ్యాజిక్కే..!

ABN , Publish Date - Aug 21 , 2024 | 02:17 PM

డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యమని, ఆరోగ్యాన్ని సంపాదించుకునే పనిలో పడ్డారు. ఆరోగ్యం మెరుగ్గా ఉండటం కోసం చాలామంది కష్టపడుతుంటారు. కానీ సింపుల్ మార్పు చేసుకుంటే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.

Early Dinner:  చక్కని ఆరోగ్యానికి అద్బుతమైన అలవాటు.. రాత్రి సమయంలో ఇదొక్కటి ఫాలో అయ్యారంటే మ్యాజిక్కే..!
Early Dinner

ఈ మధ్యకాలంలో ఆరోగ్యం గురించి పెరిగినంత అవగాహన మరే విషయంలోనూ పెరగలేదు అనేది నమ్మి తీరాల్సిన వాస్తవం. తీసుకునే ఆహారం నుండి అలవాట్లు, జీవనశైలి విషయంలో చాలా మంది సీరియస్ గా ఉంటున్నారు. డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యమని, ఆరోగ్యాన్ని సంపాదించుకునే పనిలో పడ్డారు. ఆరోగ్యం మెరుగ్గా ఉండటం కోసం చాలామంది కష్టపడుతుంటారు. కానీ సింపుల్ మార్పు చేసుకోవడం వల్ల ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. కేవలం ఒకే ఒక్క అలవాటును రోజూ ఫాలో అయితే చాలట. అదేంటో తెలుసుకుంటే..

Almonds: బాదం పప్పు ఎలా తింటే ఆరోగ్యం? మీకు తెలియని నిజాలివి..!



రాత్రి భోజనం..

ఉదయం అల్పాహారంతో రోజు మొదలవుతుంది. రాత్రి భోజనంతో ముగుస్తుంది. ఉదయం, మధ్యాహ్నం ఆహారం ఎక్కువగా తీసుకున్నా పనులు చేయడం, అటు ఇటూ తిరగం చేస్తుంటారు కాబట్టి అల్పాహారం, భోజనం ఆరోగ్యాన్ని పాడుచేసే అవకాశాలు తక్కువ కానీ రాత్రి భోజనం మాత్రం ఆరోగ్యానికి గండి పెడుతుంది.

రాత్రి భోజనం ఆలస్యంగా చేసేవారికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయట. ప్రతి రోజూ రాత్రి తొందరగా భోజనం చేస్తే కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..

Calcium Deficiency: మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? కాల్షియం లోపిస్తే ఇలా జరుగుతుంది..!



జీర్ణవ్యవస్థ..

రాత్రి భోజనం తొందరగా పూర్తీ చేస్తే ఆహారం జీర్ణం కావడానికి తగినంత సమయం లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకు విశ్రాంతిని ఇస్తుంది. నిద్ర బాగా పడుతుంది.

బరువు..

రాత్రి తొందరగా ఆహారం తింటే ఆహారం శక్తిగా మారే చర్య చురుగ్గా ఉంటుంది. అదే ఆహారం ఆలస్యంగా తీసుకుంటే తిన్న ఆహారం శక్తిగా మారడానికి బదులుగా కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

మధుమేహం..

ఆహారం తొందరగా తీసుకుంటే.. పడుకునే లోపు తిన్న ఆహారంలో చక్కెరలు శరీరంలో ప్రాసెస్ అవుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ అలవాటు చాలా మంచిది.

Black Pepper: వర్షాకాలంలో నల్ల మిరియాలు తింటే.. ఈ లాభాలన్నీ మీ సొంతం..!



గుండెపోటు..

రాత్రి సమయంలో ఆహారం ఆలస్యంగా తింటే రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

కడుపు సమస్యలు..

రాత్రి తొందరగా ఆహారం తింటే పడుకునేలోపు ఆహారం జీర్ణమై కడుపు తేలికగా ఉంటుంది. కానీ ఆహారం ఆలస్యంగా తీసుకుంటే ఆహారం సరిగా జీర్ణం కాదు. అజీర్తి వంటి సమస్యలు ఏర్పడతాయి. కడుపులో యాసిడ్ లు, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా పెరుగుతాయి.

జీలకర్ర నీరు ఏ సమయంలో తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయంటే..!

గ్రీన్ టీని ఇలా తాగితే డబుల్ బెనిఫిట్స్ పక్కా..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 21 , 2024 | 02:17 PM