Share News

Eggs: గుడ్లు బాగా తింటుంటారా? చాలా మందికి తెలియని నిజాలు ఇవీ..!!

ABN , Publish Date - Jan 02 , 2024 | 03:48 PM

గుడ్లను ఇష్టంగా తినేవారికి కూడా ఈ నిజాలు తెలిసుండవు.

Eggs: గుడ్లు బాగా తింటుంటారా? చాలా మందికి  తెలియని నిజాలు ఇవీ..!!

గుడ్లు పోషకాహారంలో భాగం. పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తింటే ఆరోగ్యం అని అంటుంటారు. గుడ్లతో బిర్యానీ నుండి బోలెడు వంటకాలు చేయవచ్చు. సమయం లేకపోతే ఎంచక్కా ఆమ్లెట్ గానో, ఉడికించో తినేయచ్చు. వండటానికి తినడానికి చాలా సులువుగా, రుచిగా ఉండే గుడ్ల గురించి చాలామందికి తెలియని నిజాలున్నాయి. అవేంటో ఓ సారి చూస్తే..

ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది

గుడ్లలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. వీటిలో అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. రోజా ఒక గుడ్డు తింటే శరీరానికి అవసరమైన ప్రోటీన్ లో 25శాతం లభిస్తుంది. కణజాల మరమ్మత్తుకు, కణాల నిర్మాణానిికి, ఆరోగ్యకరమైన శరీరానికి ప్రోటీన్లు చాలా అవసరం.

ఇది కూడా చదవండి: జీవితంలో సక్సెస్ కావాలంటే చెయ్యాల్సిన 10 పనులివీ..!


విటమిన్లు, ఖనిజాలు..

విటమిన్ ఎ చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైనది. విటమిన్ B12 నరాల పనితీరుకు కీలకం. విటమిన్ డి ఎముక ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఐరన్ ఆక్సిజన్ రవాణాకు అవసరం. సెలీనియం గొప్ప యాంటీఆక్సిడెంట్. ఇవన్నీ గుడ్లలో లభిస్తాయి. మొత్తం శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

మెదడు ఆరోగ్యానికి..

గుడ్లలో పుష్కలంగా ఉండే కోలిన్ మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకం. ఇది ఎసిటైల్‌కోలిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది అబిజ్ఞా పనులలో పాల్గొనే న్యూరోట్రాన్స్‌మిటర్. గర్భధారణ సమయంలో ఇది చాలా ముఖ్యం. కోలిన్ పిండం మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది. అందుకే గర్భవతులకు రోజూ ఒక గుడ్డు తినాలని చెబుతారు.

కంటి ఆరోగ్యం..

గుడ్లలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లయిన లుటిన్ జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సమ్మేళనాలు హానికరమైన కాంతి తరంగాల నుండి కళ్ళను రక్షిస్తాయి. వయస్సు సంబంధిత మచ్చల క్షీణత, కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇది కూడా చదవండి: ఓ మై గాడ్.. లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే.. జరిగేదిదే..!

( గమనిక: ఇది ఆరోగ్య నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న విషయాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 02 , 2024 | 03:48 PM