Eggs Vs Chicken: గుడ్లు, చికెన్.. రెంటింటిలో ఎందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందంటే..!
ABN , Publish Date - May 28 , 2024 | 02:13 PM
శరీరానికి పెద్ద మొత్తంలో ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ శరీరంలో చాలా పనులు నిర్వర్తిస్తుంది. దీని లోపం ఏర్పడితే శరీరం నిర్జీవంగా మారుతుంది. అందుకే గుడ్లు, చికెన్ మీద ఆధారపడేవారు చాలామంది ఉంటారు.
ఆరోగ్యకరమైన ఆహారం జాబితాలో గుడ్లు, చికెన్ కు తప్పనిసరిగా స్థానం ఉంటుంది. ఇవి రెండూ ప్రోటీన్ సమృద్దిగా ఉన్న ఆహారాలు. శరీరానికి పెద్ద మొత్తంలో ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ శరీరంలో చాలా పనులు నిర్వర్తిస్తుంది. దీని లోపం ఏర్పడితే శరీరం నిర్జీవంగా మారుతుంది. అందుకే గుడ్లు, చికెన్ మీద ఆధారపడేవారు చాలామంది ఉంటారు. అయితే ఇవి రెండూ ప్రోటీన్ ఉన్న ఆహారాలే అయినా రెండింటిలో ఏది ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుందో తెలుసుకుంటే..
చికెన్..
చికెన్ లో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. 100గ్రాముల చికెన్ లో 32.1 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ పొటాషియం, కాపర్, మాంగనీస్, సెలీనియం, విటమిన్ బి6, విటమిన్ బి12 మొదలైనవి ఉన్నాయి.
ఈ 9 అలవాట్లు పిల్లలను మేధావులను చేస్తాయి..!
గుడ్లు..
ఒక మీడియం గుడ్డు 5.54 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. 100 గ్రాముల గుడ్డులో 12.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం, విటమిన్ B6, ఫోలేట్, విటమిన్ B12, విటమిన్ A అందిస్తుంది.
ప్రోటీన్ పరంగా చూస్తే గుడ్లలో కంటే చికెన్ లో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. అలాగని గుడ్లను తక్కువ చేయడం దీని ఉద్దేశ్యం కాదు. ప్రతిరోజూ ఉడికించిన గుడ్లను తీసుకుంటే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కోలిన్ లోపం పోతుంది. గుండె జబ్బులు తగ్గుతాయి. కళ్లకు అవసరమైన లూటిన్, జియాంక్సంతిన్ అందుతుంది. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్దిగా లభిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి.
అదేవిధంగా ఉడికించిన చికెన్ తీసుకుంటే కండరాలు దృఢంగా మారడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలసట, బలహీనతకు ఔషధంలా పనిచేస్తుంది. విటమిన్ B12 లోపాన్ని తగ్గిస్తంది. థైరాయిడ్ వ్యాధికి సహాయపడుతుంది, మెదడుకు శక్తిని ఇస్తుంది.
ఈ 9 అలవాట్లు పిల్లలను మేధావులను చేస్తాయి..!
మీకు కోపం ఎక్కువా? అయితే ఇలా కంట్రోల్ చేసుకోండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.