Eye Cataract: ఈ 6 ఆయుర్వేద పద్దతులు పాటిస్తే చాలు.. కంటి శుక్లం లైఫ్ లో మిమ్మల్ని టచ్ చేయదు..!
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:06 PM
ప్రతి సంవత్సరం 3.8 మిలియన్ల మంది కంటి శుక్లం కారణంగా అంధులు అవుతున్నారు. కంటి లెన్స్ మీద తెల్లని పొరలాగా ఏర్పడే కంటి శుక్లం అస్సలు రాకూడదంటే ఆయుర్వేదం 6 చిట్కాలు పేర్కొంది.
కంటి శుక్లం చాలామంది చూపు మందగించడానికి కారణమయ్యే సమస్య. కంటిమీద తెల్లని పొరలాగా వచ్చే ఈ సమస్యను గుర్తించకపోతే పూర్తీగా కంటిచూపు పోవడానికి కారణం అవుతుంది. సాధారణంగా కంటి శుక్లం అనేది వృద్దాప్యానికి దగ్గరవుతున్నవారికి వచ్చేది. ప్రతి సంవత్సరం 3.8 మిలియన్ల మంది కంటి శుక్లం కారణంగా అంధులు అవుతున్నారు. కంటి లెన్స్ మీద తెల్లని పొరలాగా ఏర్పడే కంటి శుక్లం అస్సలు రాకూడదంటే ఆయుర్వేదం 6 చిట్కాలు పేర్కొంది. వీటిని ఫాలో అయితే కంటిశుక్లం అస్సలు రాదట. ఆ 6 టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
దోషాలు..
కంటిశుక్లం రావడానికి శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు కారణం అవుతాయట. ముఖ్యంగా వాత దోషం ఎక్కువగా ఉంటే కళ్లు పొడిబారడం జరుగుతుంది. పిత్త దోషం ఎక్కువ అయినప్పుడు కంటి వాపు, కంటిచూపు మందగించడం, కంటి మీద పొర రావడం జరుగుతుందట. కఫ దోషం ఎక్కువైతే కళ్ల నిర్మాణం,కళ్ళు మబ్బులుగా మారడం, కళ్ళలో నుండి నీరు కారడం వంటివి జరుగుతాయి.
పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!
ఆహారం..
పిత్త దోషాన్ని శాంత పరచడానికి దోసకాయలు, పుచ్చకాయలు, పాల ఉత్పత్తులు వంటి చలువ చేసే పదార్థాలు తినాలని, ఆకుకూరలు, చిక్కుళ్లు, బార్లీ, బియ్యం వంటి ధాన్యాలతో లభించే తీపి,చేదు, ఆస్ట్రింజెంట్ రుచులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
పుల్లని పదార్థాలు వద్దు..
కారం, పులుపు, ఉప్పు ఉన్న పదార్థాలు పిత్త దోషాన్ని ప్రభావితం చేస్తాయి. వీటిని నివారించాలి. అలాగే పుష్కలంగా నీరు తాగాలి. పండ్లు, కూరగాయలు వంటి శరీరాన్ని హైడ్రేట్ చేసే ఆహారాలు తీసుకోవాలి.
మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
యాంటీ ఆక్సిడెంట్లు..
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరలు, బచ్చలికూర, అరటిపండ్లు, బొప్పాయి తీసుకోవాలి. సుగంధ ద్రవ్యాలు అయిన పసుపు, దనియాలు, కుంకుమపువ్వు కూడా తీసుకోవాలి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. కంటి శుక్లం ఏర్పడటానికి ఆక్సీకరణ ఒత్తిడి ప్రధాన కారణం అవుతుంది.
నెయ్యి..
నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది కళ్లకు, కంటి కణజాలానికి పోషణ ఇస్తుంది. కళ్లను లూబ్రికేట్ చేయడంలో సహాయపడుతుంది.
త్రిఫల..
త్రిఫల చూర్ణం తీసుకోవడం కూడా మంచిది. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల ఈ మిశ్రమం కంటి చూపును మెరుగ్గా చేస్తుంది. విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.