Eye Sight: రోజూ ఈ పొడి చిటికెడు తీసుకుంటే చాలు.. కంటిచూపు పదునెక్కడం ఖాయం!
ABN , Publish Date - Feb 21 , 2024 | 04:49 PM
డిజిటల్ యుగంలో కంటి సంబంధ సమస్యలు ఎక్కువయ్యాయి. కంటి చూపు పదునెక్కాలంటే ఈ పొడి చిటికెడు వాడితే చాలు..
ఈ డిజిటల్ యుగంలో కంటి సంబంధ సమస్యలు ఎక్కువయ్యాయి. ఆహారంలో నాణ్యత లేకపోవడం, మొబైల్, ల్యాప్టప్, టివి మొదలైన స్క్రీన్ లకు గంటలు గంటలు అతుక్కుపోవడం వల్ల కంటి చూపు రానురాను మందగిస్తోందనే చెప్పవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కళ్లజోడు వాడటం దీనికి పెద్ద ఉదాహరణ. అయితే కంటిచూపు పదును పెట్టడానికి కొన్ని ఆయుర్వేద మూలికలకు సంబంధించిన పౌడర్లు చక్కగా సహాయపడతాయి. వీటిని రోజూ ఓ చిటికెడు తీసుకుంటే షాకింగ్ ఫలితాలుంటాయి. అవేంటో తెలుసుకుంటే..
అతిమధురం..
అతిమధురం పొడిని ఆహారంలో భాగం చేసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. ఇందులోని ఔషధ గుణాలు కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. పాలతో కలిపి దీన్ని తీసుకోవాలి. లేకపోతే నెయ్యి లేదా తేనెతో కూడా తీసకోవచ్చు.
ఇది కూడా చదవండి: Super Foods: ఈ 5 ఆహారాలు తీసుకుంటూ ఉంటే చాలు.. సీజన్ ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు..!
భృంగరాజ్..
భృంగరాజ్ ను గుంటగలరాకు అని కూడా అంటారు. సాధారణంగా ఇది జుట్టుకోసం ఎక్కువ వాడతారు. కానీ ఇది కంటి సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. కంటి సంబంధిత వ్యాధులను సమర్థవంతంగా నయం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. కంటి చూపును మెరుగుపరచడానికి భృంగరాజ్ మూలికను పేస్ట్ చేసి కళ్లమీద లేపనం వేయవచ్చు. దీన్ని ఆహారంలో కూడా తీసుకోవచ్చు.
వెల్లుల్లి..
వెల్లుల్లి ఆహారాన్ని రుచిగా మార్చడానికి మాత్రమే కాకుండా దృష్టిని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. మంచి కంటి చూపు కోసం, ప్రతిరోజూ వెల్లుల్లి రసం తీసుకోవచ్చు.
ఇది కూాడా చదవండి: రోజూ ఉదయాన్నే ఓ చిన్న ముక్క అల్లం నమిలి తింటే.. జరిగేదిదే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.