Share News

Fatty Liver: ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే.. వెంటనే వైద్యుడిని కలవాల్సిందే..!

ABN , Publish Date - Jul 20 , 2024 | 12:21 PM

ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో లక్షణాలు అంత తొందరగా కనుక్కోలేము. ఇవి చాలా సాధారణ ఆరోగ్య సమస్యల్లా అనిపిస్తుంటాయి. కానీ లివర్ టెస్ట్ కు వెళ్లినప్పుడు తప్ప అవన్నీ ఫ్యాటీ లివర్ కు సంబంధించినవే అని తెలుసుకోలేము.

Fatty Liver: ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే.. వెంటనే వైద్యుడిని కలవాల్సిందే..!
Fatty Liver

ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. కాలేయం కొవ్వుతో నిండిపోవడం వల్ల కాలేయం పనితీరు దెబ్బతింటుంది. ఇది శరీర పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలు రావడానికి కూడా కారణం అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో లక్షణాలు అంత తొందరగా కనుక్కోలేము. ఇవి చాలా సాధారణ ఆరోగ్య సమస్యల్లా అనిపిస్తుంటాయి. కానీ లివర్ టెస్ట్ కు వెళ్లినప్పుడు తప్ప అవన్నీ ఫ్యాటీ లివర్ కు సంబంధించినవే అని తెలుసుకోలేము. ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో ఉండే లక్షణాలేంటి? తెలుసుకుంటే..

Hemoglobin: ఈ 8 ఆహారాలు తీసుకుంటే చాలు.. మహిళలలో హిమోగ్లోబిన్ కు ఢోకా ఉండదు..!



అలసట..

శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. పనుల మధ్య విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అలసట తగ్గి తిరిగి పనులను చురుగ్గా చేసుకోగలుగుతాము. కానీ అసలు పని చేయకపోయినా, కొన్ని నిముషాలకే తీవ్రమైన అలసట వస్తున్నా, శరీరంలో శక్తి లేనట్టు అనిపిస్తున్నా అది ఫ్యాటీ లివర్ కు కారణం కావచ్చు.

పొట్ట అసౌకర్యం..

పొట్టకు కుడి భాగంలో అస్పష్టంగా నొప్పి లేదా అసౌకర్యం ఏర్పడుతుంటే దాన్ని కూడా ఫ్యాటీ లివర్ లక్షణంగా పరిగణిస్తారు.

వాపు..

ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో ఒంట్లో నీరు చేరుతుంది. ముఖ్యంగా పొట్ట లేదా కాళ్ళలో నీరు చేరి వాపు వచ్చినట్టు కనిపిస్తుంది.

ఈ 5 డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే అస్సలు తినకూడదు..!


ఆకలి లేకపోవడం..

ఆకలి లేకపోవడం కూడా ఫ్యాటీ లివర్ సమస్య లక్షణం కావచ్చు. ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో తినాలనే కోరిక బాగా తగ్గిపోతుంది. అలాగే ఊహించని విధంగా బరువు తగ్గుతారు.

కామెర్లు..

ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారతాయి. కామెర్లతో ఇబ్బంది పడేవారు.. పదే పదే కామెర్ల సమస్య బారిన పడేవారు ఫ్యాటీ లివర్ బారిన పడే అవకాశం ఎక్కువ.

గందరగోళం..

ఏకాగ్రత లేకపోవడం, మానసికంగా గందరగోళానికి గురి కావడం ఫ్యాటీ లివర్ లో లక్షణాలు.

రక్తనాళాలు..

రక్తనాళాల స్థితిని బట్టి కూడా ఫ్యాటీ లివర్ ను అంచనా వేయవచ్చు. రక్తనాళాలు అన్నీ ఒకే చోట సాలీడులా కనిపిస్తూ ఉంటే అవి కూడా ఫ్యాటీ లివర్ ను సూచిస్తాయి.

ఈ పానీయాలు తాగితే చాలు.. చెడు కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది..

మెంతి మొలకలు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 20 , 2024 | 12:21 PM