Fenugreek Seeds: ఆ సమస్యతో బాధపడేవారికి ఇదొక సంజీవని..
ABN , Publish Date - Dec 09 , 2024 | 04:07 PM
మెంతి గింజలు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతాయి. కేవలం ఇది మాత్రమే కాదు వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Fenugreek Seeds: మెంతులను వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. రుచికి చేదుగా ఉన్న ఈ మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివని ఇప్పటికే కొన్ని పరిశోధనలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇదొక సంజీవని. మెంతి గింజలలో ఉన్న ఫైబర్ జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది. యసిడిటీ నుంచి రక్షించడంతో పాటు క్యాన్సర్ ను నివారించే గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, మెంతులు శరీరంలో ఇన్సులిన్ పరిమాణాన్ని పెంచుతాయి. కాబట్టి షుగర్ పేషెంట్లు దీనిని తీసుకోవాలి. టైప్-2 మధుమేహాన్ని నియంత్రించడంలో మెంతి నీరు మేలు చేస్తుంది.
10 మందిలో 4 మంది..
ఈ రోజుల్లో చాలా మంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో 10 మందిలో 4 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహం అనేది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. దీనికి ఎలాంటి శాశ్వత నివారణ లేదు. కేవలం నియంత్రించబడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెర స్థాయిని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. లేకుంటే తీవ్రమైన వ్యాధుల బారిన పడతారు. అటువంటి పరిస్థితిలో, ఈ వ్యాధిని నియంత్రించడానికి మెంతులు ఎంతగానో సహాయపడుతాయి. బరువు తగ్గడానికి కూడా ఈ గింజలు ఉపయోగపడుతాయి. మెంతుల్లో ముఖ్యంగా పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి.
ప్రాణాపాయం లాంటిది..
బరువు తగ్గించడంలో మెంతులు ఉపయోగపడుతాయి. మీకు అల్సర్ సమస్య ఉన్నట్లయితే, మెంతులు కడుపులోని అల్సర్ల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తాయి. కడుపులో రాళ్లతో బాధపడేవారికి ఇది ప్రాణాపాయం లాంటిది. మెంతి టీ తాగడం వల్ల రాళ్ల సమస్యను దూరం చేస్తుంది. మెంతి గింజలను రాత్రిపూట అర గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఈ నీటిని తాగి తర్వాత మెంతి గింజలను నమిలి తినాలి. కొద్ది రోజుల్లో మీరు దీని నుండి చాలా ప్రయోజనాలను పొందుతారు.
(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)