Finger Millet: రాగులు తింటే ఇన్ని లాభాలు ఉంటాయని తెలుసా?
ABN , Publish Date - Aug 30 , 2024 | 01:10 PM
రాగులు చిరు ధాన్యాలలో ఒకటి. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటూ బోలెడు పోషకాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో..
రాగులు చిరు ధాన్యాలలో ఒకటి. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటూ బోలెడు పోషకాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో రాగులను రాగి సంగటి, రాగి అంబలి తయారు చేసుకుని తీసుకుంటారు. మరికొందరు రాగి రొట్టెలు, రాగి లడ్డులూ, రాగి పిండితో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుని తింటారు. అయిచే రాగులను ఆహారంలో తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే..
రాగులలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, భాస్వరం, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటూ మలబద్దకాన్ని నివారిస్తుంది.
Olive Oil: సరైన ఆలివ్ ఆయివ్ ను ఎలా ఎంచుకోవాలి ? ఈ 5 చిట్కాలు ఫాలో అయితే సరి..!
రాగులు సహజమైన గ్లూటెన్ ఫ్రీ ఆహారం. గ్లూటెన్ సైడ్ ఎఫెక్ట్స్ లేదా అలెర్జీ ఉన్నవారు, ఉదరకుహుర వ్యాధి ఉన్నవారు రాగులను తీసుకోవచ్చు. ఇది పోషకాల శోషణను పెంచుతుంది. పాలు తీసుకోలేని వారు రాగులు తీసుకోవండ వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం ను ఇది అందిస్తుంది.
రాగులలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఈ కారణంగా ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది చక్కెరను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది. అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది.
Hair Fall: వర్షాల కారణంగా జుట్టు బాగా రాలిపోతోందా? ఇవి తినండి చాలు..!
మధుమేహం ఉన్నవారికి రాగులు చాలా అద్భుతమైన ధాన్యం. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ కార్బోహైడ్రేట్స్ ను నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ బ్యాలెన్స్డ్ గా ఉండటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే అమైనో యాసిడ్స్ ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది.
రాగులలో పాలీఫెనాల్స్, టానిన్లు, పైటేట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, మెదడు దెబ్బతినడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడం ద్వారా క్యాన్సర్, గుండె జబ్బులు, న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
Herbal Water: ఇంట్లోనే హెర్భల్ వాటర్ ఇలా తయారు చేసుకుని తాగండి.. చర్మం మెరిసిపోవడం ఖాయం..!
Migraine: మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో సమస్య నుండి బయటపడవచ్చు..!
Low BP: లో బీపీ సమస్య ఉందా? ఈ 3 వస్తువులు వెంట ఉంచుకుంటే మంచిది..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.