Migraine: మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో సమస్య నుండి బయటపడవచ్చు..!
ABN , Publish Date - Aug 28 , 2024 | 10:18 PM
మైగ్రేన్ చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈ సమస్యలో తల ఒకవైపు నొప్పి ఉంటుంది. ఇది ఒకసారి వస్తె చాలా కాలం పాటు ఉంటుంది. చాలామంది మైగ్రేన్ కు చికిత్స లేదని అంటూ ఉంటారు. అందుకే మైగ్రేన్ కు నిర్ణీత మందులు ఏవి అందుబాటులో లేవు. అయితే..
Migraine Relief Tips: మైగ్రేన్ చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈ సమస్యలో తల ఒకవైపు నొప్పి ఉంటుంది. ఇది ఒకసారి వస్తె చాలా కాలం పాటు ఉంటుంది. చాలామంది మైగ్రేన్ కు చికిత్స లేదని అంటూ ఉంటారు. అందుకే మైగ్రేన్ కు నిర్ణీత మందులు ఏవి అందుబాటులో లేవు. అయితే.. మైగ్రేన్ సమస్య నుండి ఉపశమనం పొందేందుకు ఆహార నిపుణులు సూచించిన చిట్కాలు చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ చిట్కాను రోజు క్రమం తప్పకుండా నెల రోజుల పాటు పాటించాలి. అదేంటో తెలుసుకుంటే .
మైగ్రేన్ నొప్పి తగ్గడానికి ఒక గ్లాసు నీటిలో ¼ స్పూన్ లవంగం పొడిని వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీటిని తాగాలి. ఇలా 2. నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే మైగ్రేన్ సమస్య నుండి ఉపశమనం ఉంటుంది.
ఇవి కూడా మైగ్రేన్ తగ్గిస్తాయి..
మైగ్రేన్ నొప్పి ఉన్న ప్రదేశంలో చల్లని లేదా వేడి కట్టు వేయడం వల్ల మైగ్రేన్ నుండి ఉపశమనం పొందవచ్చు. కోల్డ్ కంప్రెస్ వాపును తగ్గిస్తుంది. అయితే వేడి కాపడం పెట్టడం వల్ల కండరాలకు ఉపశమనం లభిస్తుంది.
శరీరంలో నీటి కొరత ఏర్పడినా తలనొప్పి వస్తుంది. చాలా మంది నీరు తక్కువగా తాగుతూ తమకు మైగ్రేన్ ఉందని అనుకుంటారు. నీరు పుష్కలంగా తీసుకోవడం వల్ల డీహేడ్రేషన్ ను నివారించవచ్చు. అలాగే తలనొప్పిని కూడా తగ్గించుకోవచ్చు.
అల్లం తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లాన్ని ఆహారంలోనూ, అల్లం టీగానూ, అల్లాన్ని నీటిలో ఉడికించి కానీ తీసుకోవచ్చు.
పిప్పరమెంట్ ఆయిల్ ను నుదిటిపై కొన్ని చుక్కలు వేసి తేలికగా మసాజ్ చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. పిప్పరమెంట్ గుణాలు నొప్పిని, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.
లావెండర్ ఆయిల్ సువాసన మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.దీన్ని అరోమా థెరపీగా ఉపయోగించవచ్చు. స్నానం చేసే నీటిలో జోడించుకోవచ్చు.
చల్లని, వేడి నీటి స్నానం మైగ్రేన్ నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. స్నానం చేసేటప్పుడు చల్లని నీరు, వేడి నీరు రెండింటిని ఒకదాని తరువాత ఒకటి పోసుకుంటూ స్నానం చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగయ్యి మైగ్రేన్ తగ్గుతుంది.
తల, మెడ, భుజాలపై తేలికపాటి మసాజ్ చేయడం వల్ల కండరాలు సడలించబడతాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
మైగ్రేన్ సమస్య ఎక్కువకాలం ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే యోగా, ధ్యానం, మానసిక ఆరోగ్యాన్ని ప్రేరేపించే వ్యాయామాలు చేయాలి.
క్రమం తపప్కుండా సమతుల ఆహారం తీసుకోవాలి. మైగ్రేన్ ట్రిగ్గర్ ఆహారాలు ఆహరాలు అయిన కెఫిన్, చాక్లెట్, అధిక ఉప్పు మొదలైనవి నివారించాలి.