Share News

Foot Fungal Infection: మధుమేహం ఉన్నవారికి అలర్ట్.. వర్షాకాలంలో వచ్చే ఈ సమస్యతో పెద్ద ముప్పే..!

ABN , Publish Date - Jul 27 , 2024 | 10:50 AM

వర్షాకాలం వచ్చిందంటే వైరల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు సమస్యల గురించి జాగ్రత్తలు తీసుకునేవారు ఎక్కువ. మరికొందరు ఆహారం, నీరు కలుషితం అవుతుందని వాటి నుండి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడతారు. ఇవి కాకుండా మధుమేహ రోగులకు పెద్ద ముప్పు పొంచి ఉంది.

Foot Fungal Infection:  మధుమేహం ఉన్నవారికి అలర్ట్.. వర్షాకాలంలో వచ్చే ఈ సమస్యతో పెద్ద ముప్పే..!
Foot Fungal infection

వర్షాకాలం వచ్చిందంటే వైరల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు సమస్యల గురించి జాగ్రత్తలు తీసుకునేవారు ఎక్కువ. మరికొందరు ఆహారం, నీరు కలుషితం అవుతుందని వాటి నుండి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడతారు. అయితే వర్షాకాలంలో చాలా ఎక్కువగా వచ్చే ఇన్ఫెక్షన్ ఒకటి ఉంది. అదే ఫుట్ ఫంగల్ ఇన్ఫెక్షన్. పాదాలు, కాలి వేళ్ల మధ్య ఇన్పెక్షన్ వచ్చి ఇది పుండుగా మారి చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది సాధారణంగా మెడిసిన్ తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. కానీ మధుమేహం ఉన్నవారికి మాత్రం ఇది చాలా పెద్ద ముప్పు తెచ్చిపెడుతుందని అంటున్నారు వైద్యులు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

చాణక్యుడు చెప్పిన ఈ 10 విషయాలు అనుసరిస్తే.. యువత విజయాల బాట పడతారు!


వర్షాకాలంలో రోడ్ల మీద నీరు నిలుస్తుంది. కొన్ని చోట్ల బురద కూడా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులో వీటిలో నడవాల్సి వస్తుంది. దీని కారణంగా కాళ్ల మీద దద్దుర్లు వస్తాయి. కొందరికి ఇన్పెక్షన్ కూడా వస్తుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పాదల మీద చర్మం పొలుసులుగా మారడం, దుర్వాసన రావడం జరుగుతుంది. ఇన్పెక్షన్ వ్యాపిస్తే గోళ్ల చుట్టూ వాపు వచ్చి మరింత ఇబ్బంది పెడుతుంది. దీనికి సకాలంలో వైద్యం చేయకపోతే మధుమేహ రోగులకు చాలా ముప్పు వాటిల్లుతుంది.

మధుమేహ రోగులలో గాయాలు, ఇన్ఫెక్షన్లు ఏర్పడితే అవి నయం కావడానికి సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. మధుమేహం కారణంగా గాయానికి ఆక్సిజన్ సరఫరా చాలా నెమ్మదిగా జరుగుతుంది. దీని వల్ల ఎర్రరక్త కణాలు గాయం వరకు వేగంగా వెళ్లలేవు. దీని వల్ల గాయం మరింత పెద్దది కావడం, పుండుగా మారడం, గాయం జరిగిన ప్రాంతంలో ఇన్పెక్షన్ పెరిగి కొన్ని సార్లు ఆ ప్రాంతం కుళ్లిపోవడం జరుగుతుంది. ఇలా జరిగితే కాలి వేళ్లు, పాదాలు, కాలు ఇలా కుళ్లిపోయిన భాగాన్ని ఆపరేషన్ చేసి తీసేయాల్సి ఉంటుంది.

ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!


జాగ్రత్తలు..

  • కాళ్లు ఎక్కువసేపు నీటిలో ఉంచాల్సి వచ్చినా, వర్షం నీటిలో నడిచినా.. ఇంటికి వెళ్లిన తరువాత కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత పొడి బట్టతో తడి లేకుండా తుడుచుకోవాలి.

  • వర్షాకాలంలో గోళ్లలో పంగస్ పేరుకుపోతుంది. ఇది ఇన్పెక్షన్ కు కారణం అవుతుంది. అందుకే గోళ్లను కత్తిరించుకోవాలి.

  • షూస్, సాక్స్ లు ధరించేవారు వాటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షం నీటిలో అవి తడిస్తే ఉతికి బాగా ఆరబెట్టుకోవాలి.

  • ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటం కోసం యాంటీ బ్యాక్టీరియల్ సోప్ లను కాళ్లు, చేతులు కడుక్కోవడానికి వాడాలి.

వైద్యులు చెప్పిన నిజాలు.. ఈ ఆల్కహాల్ రకాలు చాలా హెల్తీ..!

మెచ్యురిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 27 , 2024 | 10:50 AM