Garlic: వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే ఈ సమస్యలు ఎప్పటికీ రావు..
ABN , Publish Date - Dec 10 , 2024 | 04:23 PM
వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ వెల్లుల్లిని ఇలా తింటే ఈ సమస్యలు ఎప్పటికీ రావని చెబుతున్నారు. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Garlic : వెల్లుల్లి తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ వెల్లుల్లిని ప్రజలు వంటల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా కొందరు పచ్చి వెల్లుల్లిని తింటారు. మరికొందరు వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటారు. ఇలా నెయ్యి వేయించి తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. రోజూ నెయ్యిలో వేయించి వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రయోజనాలు ..
1. వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడంతోపాటు చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటి కలయిక గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
2. వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే జీర్ణవ్యవస్థ బలపడుతుంది. వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తినడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. వెల్లుల్లిని ఇలా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు దరిచేరవు.
3. కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లి, నెయ్యి రెండూ కలిపి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
4. వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే శరీరంలో మంట తగ్గుతుంది. కీళ్ల నొప్పులు లేదా కీళ్ల సంబంధిత సమస్యలతో బాధపడేవారు రోజూ వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
5. వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే శరీరం డిటాక్సిఫై అవుతుంది. ఇది లోపలి నుండి శరీరాన్ని శుభ్రపరచడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడే క్రియాశీల సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది.
(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)