Ginger Tea: మీకు అల్లం టీ అంటే ఇష్టమా? ఈ సమస్యలు ఉన్నవారు అల్లం టీ తాగకూడదట..!
ABN , Publish Date - Aug 28 , 2024 | 05:49 PM
అల్లంలోని ఘాటు వాసన గొంతుకు చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. టీకి మంచి రుచిని కూడా ఇస్తుంది. అయితే అల్లం టీ రుచిగా ఉంది కదా అని..
అల్లం భారతీయ వంటింట్లో భాగం. దీన్ని కేవలం మసాలా వంటల్లోనే కాకుండా తీపి పదార్థాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కొందరు అల్లాన్ని రోజూ టీ తయారీలో ఉపయోగిస్తుంటారు. అల్లంలోని ఘాటు వాసన గొంతుకు చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. టీకి మంచి రుచిని కూడా ఇస్తుంది. అయితే అల్లం టీ రుచిగా ఉంది కదా అని దీన్ని రోజులో పలుసార్లు తాగేవారు ఉంటారు. ఇలా అల్లం టీ ని ఇష్టంగా తాగేవారికి బ్యాడ్ న్యూస్. అల్లం టీని కొందరు తాగకూడదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అల్లం టీని ఏ వ్యక్తులు తాగకూడదో తెలుసుకుంటే..
Low BP: లో బీపీ సమస్య ఉందా? ఈ 3 వస్తువులు వెంట ఉంచుకుంటే మంచిది..!
కడుపు చికాకులు..
అల్లం వేడి స్వభావం కలిగి ఉంటుంది. అల్లం టీని ఎక్కువగా తాగేవారికి వేడి కారణంగా కడుపులో చికాకు కలుగుతుంది. దీని వల్ల ఎసిడిటీ, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. కడుపు చికాకు సమస్యలతో బాధపడేవారు అల్లం టీ ఎక్కువగా తాగకూడదు.
రక్తం పలుచన..
రక్తాన్ని పలుచన చేసే గుణాలు అల్లంలో ఉంటాయి. అల్లాన్ని అధికంగా వినియోగించడం వల్ల రక్తం గట్టకట్టడాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే రక్తం పలుచగా ఉండే సమస్యతో మందులు తీసుకునే వ్యక్తులు అల్లం వినియోగాన్ని తగ్గించాలి.
తక్కువ చక్కెర స్థాయిలు..
రక్తంలో అధిక చక్కెర స్థాయి మాత్రమే కాదు.. తక్కువ చక్కెర స్థాయిలతో ఇబ్బంది పడేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారు అల్లాన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయి తగ్గుతుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి కూడా అకస్మాత్తుగా తగ్గుతుంది.
నోటి పూతలు..
అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి పూత వస్తుంది. నోటి చర్మం, చిగుళ్లు సున్నితంగా మారతాయి. ఇప్పటికే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు అల్లాన్ని అధికంగా వినియోగించడం మానేయాలి.
ఈ భారతీయ ఆహారాల ముందు ఫారిన్ సూపర్ ఫుడ్స్ బలాదూర్..!
వర్షాకాలంలో అల్లం టీ..
సాధారమంగా వేసవి కాలంలో అయితే అల్లం టీ ని చాలా పరిమితంగా తీసుకోవాలి. అదే వర్షాకాలం, శీతాకాలంలో అయితే అల్లం టీని రెండు మూడు కప్పుల వరకు తీసుకోవచ్చు. ఇది జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి..
అన్నానికి బదులు ఇవి తినండి చాలు.. ఈజీగా బరువు తగ్గుతారు..!
పైనాపిల్ తింటే.. ఈ లాభాలన్నీ మీ సొంతం..!
ఎంత వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే ఇవి తినండి చాలు..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.