Share News

Gooseberry Seeds: ఉసిరికాయలు తిని విత్తనాలు పడేస్తుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!

ABN , Publish Date - Sep 28 , 2024 | 03:15 PM

ఆయుర్వేదంలో ఉసిరికి చాలా ప్రాధాన్యత ఉంది. ఉసిరికాయను తిని దాని విత్తనాలు పడేస్తుంటారు. కానీ ఈ విత్తనాలు తింటే..

Gooseberry Seeds: ఉసిరికాయలు తిని విత్తనాలు పడేస్తుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!
Gooseberry Seeds

ఉసిరికాయను సంస్కృతంలో అమలకి అంటారు. ఉసిరి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి రోజూ ఒక ఉసిరికాయ తిన్నా, ఉసిరికాయ జ్యూస్ తాగుతున్నా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా జుట్టు, చర్మ సంరక్షణలో ఉసిరిది అందె వేసిన చెయ్యి. అదే విధంగా విటమిన్-సి పుష్కలంగా ఉండటం మూలాన ఇది బరువు తగ్గడంలోనూ, వృద్దాప్యాన్ని దరి చేరనీయకుండానూ, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. చాలామంది ఉసిరికాయలు తిని అందులో విత్తనాలు పడేస్తుంటారు. కానీ ఉసిరికాయ విత్తనాల గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంటే..

యూట్యూబ్ షార్ట్స్ నుండి డబ్బు ఎలా సంపాదించవచ్చు తెలుసా?


  • ఉసిరికాయను సూపర్ ఫ్రూట్ లాగా ఎలాగైతే పరిగణిస్తారో.. ఉసిరికాయ విత్తనాలు కూడా అంతే ప్రభావవంతంగా ఉంటాయి.

  • ఉసిరికాయ విత్తనాలు జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడతాయి. ఉసిరికాయ విత్తనాలు వాడితే జుట్టు రాలడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది.

  • ఉసిరికాయలో ఫైబర్ ఉండటం వల్ల ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. అదేవిధంగా ఉసిరికాయ విత్తనాలు కూడా జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇవి అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

  • ఉసిరికాయ విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్నిఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మాన్ని తేమగా ఉండటంలో సహాయపడతాయి.

అవకాడో తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?


  • ఉసిరికాయ గిండలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివిగా పరిగణించబడతాయి. ఈ కారణంగా ఉసిరికాయ గింజలు కూడా తీసుకుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

  • ఉసిరికాయలు మాత్రమే కాదు.. ఉసిరి గింజలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు ఉసిరికాయ, ఉసిరి విత్తనాలు రెండూ తీసుకోవచ్చు.

  • ఉసిరికాయ విత్తనాలలో కూడా విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. పేలవమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఉసిరికాయను తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి..

Beetroot: బీట్ రూట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయి.. ఈ నిజాలు తెలుసుకోండి..!

Health Tips: ఈ ఒక్క డ్రింక్ తాగండి చాలు.. జలుబు, దగ్గు నుండి ఎంత వేగంగా కోలుకుంటారంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 28 , 2024 | 03:15 PM