Guava: చలికాలంలో జామపండ్లు తినాలని చెప్పేది ఇందుకే.. ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..
ABN , Publish Date - Nov 12 , 2024 | 04:18 PM
జామపండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. అయితే.. చలికాలంలో వీటని తినాలని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
జామపండ్లను పేదవాడి యాపిల్ అని పిలుస్తారు. యాపిల్ లో ఉండే పోషకాలలో చాలాశాతం జామ పండ్లలోనూ ఉంటాయి. ఓ ఇరవై ఏళ్ల కిందట యాపిల్, కివి, లిచీ, అవకాడో, పియర్ వంటి విదేశీ పండ్ల జాడ భారత్ లో ఉండేది కాదు.. అప్పుడు పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తిన్న పండ్లు జామ పండ్లే.. అయితే ఈ జామ పండ్లను చలికాలంలో తప్పకుండా తినాలని అంటున్నారు. ఆయుర్వేదం నుండి శాస్త్రీయ వైద్యం వరకు జామ పండును రికమెండ్ చేస్తుంది. ఇంతకీ చలికాలంలో జామపండ్లు ఎందుకు తినాలంటే..
పోషకాలు..
జామ పండ్లలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా పోషకమైన పండు. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-బి, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.
Ayurveda Vs Korean: ఆయుర్వేద చర్మ సంరక్షణ, కొరియన్ చర్మ సంరక్షణ.. రెండింటిలో ఏది ఎఫెక్ట్ అంటే..
ప్రయజనాలు..
బరువు నియంత్రించడంలో జామ పండు చక్కగా సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో పైబర్ ఉంటుంది. ఈ కారణంగా జామ పండు తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. అధికంగా ఆహారం తీసుకోకుండా ఉండటంలో ఇది సహాయపడుతుంది. శరీరంలోకి వెళ్లే కేలరీల శాతాన్ని తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
విటమిన్-సి జామ పండులో అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజూ ఒక జామ పండు తింటుంటే విటమిస్-సి లోపం దరిచేరదు.
జామ పండును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. ఆహారం బాగా జీర్ణమై గ్యాస్ సమస్య రాకుండా చేస్తుంది. జీర్ణశక్తిని బలంగా మారుస్తుంది.
జామ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఇవి మధుమేహం ఉన్నవారికి కూడా సేఫ్ గా పరిగణించబడతాయి. మధుమేహం లేని వారు కూడా జామ పండ్లను తింటూ ఉంటే మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కూడా జామపండు సహాయపడుతుంది. ముఖ్యంగా గుండెకు రక్త ప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. గుండె సంబంధ వ్యాధులను, గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది.
Health Tips: వంటల్లో పచ్చ కర్పూరం ఎందుకు జోడిస్తారు? ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదంటే..
చర్మ సంరక్షణకు కూడా జామపండ్లు భేషుగ్గా పని చేస్తాయి. జామ పండ్లు రెగ్యులర్ గా తీసుకుంటే చర్మం మెరుస్తుంది. చర్మం యవ్వనంగా మారుతుంది. జామలో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మం ఎలాస్టిక్ గుణాన్ని పెంచుతుంది. మచ్చలు, ముడతలు, గీతలను తొలగిస్తుంది.
జామ పండ్లు తింటే కంటి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఇది కంటి సంబంధ సమస్యల నుండి బయట పడటంల సహాయపడుతుంది. కంటిచూపును మెరుగు పరుస్తుంది.
జామపండ్లలో మెగ్నీషియం ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారు రోజూ ఒక జామ పండు తింటూ ఉంటే మానసిక ఒత్తిడి నియంత్రించుకోవచ్చు.
జామ పండ్లలో యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు మెరుగ్గా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును, నొప్పిని తగ్గిస్తాయి. శరీరంలో కండరాలను రిలాక్స్ గా ఉంచుతాయి.
ఇవి కూడా చదంవడి..
కార్తీక పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే దైవ కృప ఖాయం..
ఈ ఒక్క పండు తింటుంటే చాలు.. కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చట..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.