Share News

Gynecologic Cancer: స్త్రీలు జననేంద్రియాల దగ్గర ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు..!

ABN , Publish Date - Sep 06 , 2024 | 10:56 AM

జననేంద్రియ క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను చికిత్స ద్వారా తొందరగా నయం చేసుకోవచ్చు. సాధారణంగా మహిళలు తమ జననేంద్రియాల దగ్గర కనిపించే కొన్ని లక్షణాలను చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు.

Gynecologic Cancer: స్త్రీలు జననేంద్రియాల దగ్గర ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు..!
gynecologic-cancer

స్త్రీ జననేంద్రియ అవేర్ నెస్ నెలగా సెప్టెంబర్ ను పేర్కొంటారు. స్త్రీ పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేసే క్యాన్సర్ గురించి అవగాహన పెంచే ఉద్దేశ్యంతో దీనిని జరుపుకుంటారు. జననేంద్రియ క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను చికిత్స ద్వారా తొందరగా నయం చేసుకోవచ్చు. సాధారణంగా మహిళలు తమ జననేంద్రియాల దగ్గర కనిపించే కొన్ని లక్షణాలను చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. కింది లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..


Weight Loss: బరువు తగ్గడానికి ఏ జ్యూసులు తాగితే మంచిది? ఫిట్‌నెస్ నిపుణులు చెప్పిన నిజాలివీ..!



రక్తస్రావం..

నెలసరికి లోపల లేదా నెలసరి తరువాత కూడా రక్తస్రావం అధికంగా అవుతుంటే అది ప్రమాదం. ఇది సాధారణంగా హెవీ పీరియడ్స్ గా పరిగణిస్తారు. పీరియడ్స్ కు మధ్యలో చుక్కలు చుక్కలుగా రక్త స్రావం జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగే రక్తస్రావం అండాశయ క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్లకు సంకేతం కావచ్చు.

పెల్విక్ పెయిన్..

వారాలు లేదా నెలల తరబడి కొనసాగే కటి నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది అండాశయ క్యాన్సర్, స్త్రీ జననేంద్రియ సమస్యలకు లక్షణంగా దీన్ని పరిగణిస్తారు. దీర్ఘకాలం ఈ నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.


Chia Seeds: ఆరోగ్యానికి మంచిదని చియా సీడ్స్ వాటర్ బాగా తాగుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!



బరువు, ఆకలి..

ఊహించని విధంగా బరువు తగ్గడం, స్పష్టమైన కారణం లేకుండా ఆకలి లేకపోవడం వంటివి స్త్రీ జననేంద్రియ క్యాన్సర్.. ముఖ్యంగా అండాశయ క్యాన్సర్ కు ప్రారంభ సంకేతం. బరువులో హెచ్చు తగ్గులు ఉంటే వైద్యులను కలవాలి.

ఉబ్బరం..

కొన్ని వారాల కంటే ఎక్కువ కాలం పాటూ కడుపు ఉబ్బరం ఉన్నా, ఆహారంలో మార్పులు చేసుకున్నా ఈ ఉబ్బరం సమస్య ఇబ్బంది పెడుతున్నా.. పొత్తి కడుపు నొప్పి, పేగు ఆరోగ్యంలో ఇబ్బంది వంటివి ఉన్నా అండాశయ క్యాన్సర్ ను సూచిస్తాయి. శరీరాన్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి.

ఈ ఆహారాలు తీసుకోండి చాలు.. విటమిన్-డి లోపం మిమ్మల్ని టచ్ చేయదు..!


బాత్రూమ్ అలవాట్లు..

తరచుగా మూత్రవిసర్జన, మలబద్దకం, అతిసారం వంటివి కొన్ని వారాల కంటే ఎక్కువ కాలం పాటూ కొనసాగడం కేవలం ఆహారం వల్ల ఎదురయ్యే సమస్యలు కావు. పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్ ను ఇవి సూచిస్తాయి. బాత్రూమ్ అలవాట్లు అకస్మాత్తుగా చాలా ఎక్కువగా ఉంటే వైద్యులను కలవాలి.

ఇవి కూడా చదవండి..


Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా మంది మహిళలకు తెలియని 5 లక్షణాలు ఇవి..!


Health Tips: క్రమం తప్పకుండా 2వారాల పాటూ కొబ్బరి నీరు లేదా నిమ్మకాయ నీరు తాగితే ఏం జరుగుతుంది?


Green Tea: ఈ సమయంలో గ్రీన్ టీ తాగండి.. ఫలితాలు చూసి షాక్ అవుతారు..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 06 , 2024 | 10:56 AM