Share News

Hair Care: తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యలు మీకూ ఉన్నాయా? యోగా మాస్టర్ చెప్పిన ఈ టిప్స్ ట్రై చేసి చూడండి..!

ABN , Publish Date - Oct 01 , 2024 | 07:32 PM

తెల్ల జుట్టు, జుట్టు రాలడం ఈ కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు. ఇవి రెండూ తగ్గడానికి ఒక యోగా మాస్టర్ చెప్పిన అద్భుతమైన చిట్కాలు ఇవే..

Hair Care: తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యలు మీకూ ఉన్నాయా? యోగా మాస్టర్ చెప్పిన ఈ టిప్స్   ట్రై చేసి చూడండి..!
Hair Care

అందంగా కనిపించడంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తుగా నల్లగా నిగనిగలాడే జుట్టు ఉన్నవారు ఎంత గర్వంతో ఉంటారో చాలామందికి అనుభవంగానే తెలిసి ఉంటుంది. చాలా వరకు జుట్టు గురించి మాట్లాడేటప్పుడు కేశ సంపద అని అంటుంటారు. కానీ నేటి కాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు అధికంగా ఉండటం చూస్తూనే ఉంటాం. జుట్టు బలహీనంగా మారి రాలిపోవడం కొందరి సమస్య అయితే చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో మరికొందరు ఇబ్బంది పడుతుంటారు. అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు తెల్లజుట్టు నివారించడానికి, జుట్టు రాలడం తగ్గడానికి ఒకే హెయిర్ ప్యాక్ ను సూచించారు ఒక యోగా మాస్టర్. ఇంతకీ ఇదేం హెయిర్ ప్యాక్.. దీన్నెలా తయారు చేసుకోవాలి? జుట్టు దృఢంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన వివరాల పై ఒక లుక్కేస్తే..

Skin Care: వామ్మో.. ఆవాల నూనె, పసుపు కలిపి ముఖానికి రాస్తే ఇంత మ్యాజిక్కా?


హెయిర్ ప్యాక్ కు కావలసిన పదార్థాలు..

ఇనుప పాత్ర..

హెర్భల్ గోరింటాకు.. 100 గ్రాములు

కరివేపాకు పొడి.. 50 గ్రాములు

మందార పూల పొడి.. 50 గ్రాములు

ఉసిరిపొడి.. 50 గ్రాములు

పెరుగు.. 10గ్రాములు

నీరు.. 1.5 గ్లాసులు

హెర్బల్ ఆయిల్..

నల్ల నువ్వులు..

హెయిర్ ప్యాక్ ఎలా చేయాలి..

ఇనుప పాత్ర తీసుకుని అందులో గోరింటాకు పొడి, మందార పొడి, ఉసిరి పొడి, కరివేపాకు పొడి, పెరుగు, నీరు వేసి బాగా కలపాలి. ఇనుప పాత్ర మీద మూత పెట్టి ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి.

Health tips: పైన్ విత్తనాలు ఎప్పుడైనా తిన్నారా? ఇవి తింటే ఎన్ని లాభాలంటే..!


ఎలా వాడాలి..

రాత్రంతా నానిన గోరింట మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. జుట్టుకు బాగా పట్టేలా లేయర్ లు తీసుకుంటూ గోరింట ప్యాక్ వేసుకోవాలి. సుమారు 3 గంటల పాటూ దీన్ని అలాగే ఉంచాలి. మూడు గంటల తరువాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. జుట్టు శుభ్రం చేసుకోవడానికి కెమికల్ షాంపూలు వాడకూడదు. ఈ హెయిర్ ప్యాక్ ను జుట్టు సమస్య ఎక్కువగా ఉన్నవారు వారం లేదా 10 రోజులకు ఒకసారి వేసుకోవచ్చు. సమస్య తక్కువగా ఉన్నవారు నెలలో రెండు సార్లు వేసుకోవచ్చు.

జుట్టు బలంగా ఉండాలంటే..

జుట్టు బలంగా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం అల్పాహారం తిన్న తరువాత ఒక స్పూన్ ఉసిరి పొడిని తింటూ ఉండాలి. అలాగే తల స్నానం చేసిన తరువాత ఎక్కువ రోజులు జుట్టుకు నూనె లేకుండా వదిలేయకూడదు. హెర్బల్ ఆయిల్ ను అప్లై చేస్తూ ఉండాలి.

ప్రతి రోజూ రాత్రి భోజనం చేసిన తరువాత 1 టీ స్పూన్ నల్లనువ్వులను బాగా నమిలి తినాలి. నల్ల నువ్వులలో ఐరన్, కాల్షియం సమృద్దిగా ఉంటుంది. జుట్టు పెరగడానికి, జుట్టు నల్లగా మారడానికి ఇవి సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి..

కింగ్ కోబ్రా గురించి చాలామందికి తెలియని నిజాలివి..!

దానిమ్మ పండును వరుసగా వారం రోజులు తింటే ఏం జరుగుతుందంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 01 , 2024 | 07:32 PM